newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెరికాలో సెనేట్ ప‌ద‌వికి పోటీ పడుతున్న తెలుగు మ‌హిళ ఉషారెడ్డి

07-02-202007-02-2020 07:27:54 IST
Updated On 07-02-2020 11:58:26 ISTUpdated On 07-02-20202020-02-07T01:57:54.223Z07-02-2020 2020-02-07T01:57:50.321Z - 2020-02-07T06:28:26.092Z - 07-02-2020

అమెరికాలో సెనేట్ ప‌ద‌వికి పోటీ పడుతున్న తెలుగు మ‌హిళ ఉషారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ భార‌తీయ మ‌హిళా, అందునా తెలుగు మ‌హిళ అమెరికాలో సెనేట్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మ‌న్హ‌ట‌న్ న‌గ‌రానికి రెండుసార్లు మేయ‌ర్‌గా ఎన్నికై ప్ర‌జా సేవ‌లు ఉన్న ఉషారెడ్డి ఇప్పుడు డెమాక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున సెనేట్ ప‌ద‌వి కోసం పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారానికి ల‌క్ష డాల‌ర్ల‌ను కూడా సేక‌రించి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ‌య్యారు. అయితే, ఉషారెడ్డి జీవితంలో ప‌లు విషాద‌క‌ర సంఘ‌ట‌న‌లు, క‌ష్టాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి ఎదిగారు.

ఉషారెడ్డి పూర్వికుల‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. ఆమె ఎనిమిదేళ్ల వ‌య‌స్సు ఉన్న వర‌కు ఇక్క‌డే పెరిగారు. 1973లో వారి కుటుంబం అమెరికా వెళ్లింది. అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. అయితే, ప‌దేళ్ల వ‌య‌స్సులో ఉషారెడ్డిపై స్వంత తండ్రి వెంక‌ట యేలేటి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.

40 ఏళ్ల త‌ర్వాత అత‌డికి గ‌త సంవ‌త్స‌రం శిక్ష కూడా ప‌డింది. అయితే, తండ్రి చేసిన దారుణ సంఘ‌ట‌న‌ను దిగమింగుకొని ఆమె విద్యావేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కురాలిగా ఎదిగారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఆమె అమెరికాలోనే ఉపాధ్యాయురాలిగా స్థిర‌ప‌డ్డారు. కొందరికి ఆమె ఉచిత విద్యాను అందించారు. ఆమె సేవ‌లకు గుర్తుగా పప‌లు అవార్డుల‌ను సైతం అందుకున్నారు.

25 ఏళ్లుగా మ‌న్హ‌ట‌న్‌లో నివ‌సిస్తున్న ఉషారెడ్డి స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. 2013లో ఆమె కాన్సాస్ రాష్ట్రంలోని మ‌న్హ‌ట‌న్ క‌మిష‌న‌ర్‌గా ఎన్నిక‌య్యారు. 2016లో మేయ‌ర్‌, ఇటీవ‌ల మ‌రోసారి మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

ప్ర‌స్తుతం ఆమె కాన్సాస్ నుంచి సెనేట్‌కు పోటీ చేయాల‌నుకుంటున్నారు. డెమాక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం ఆమెతో పాటు మ‌రో ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం ఏడుగురు పోటీ ప‌డుతున్నారు. ఆగ‌స్టులో ఉషారెడ్డి అభ్య‌ర్తిత్వం ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది.

అయితే, కాన్సాస్ రాష్ట్రం పూర్తిగా రిప‌బ్లిక‌న్ పార్టీకి ప‌ట్టున్న ప్రాంతం. ఇక్క‌డ 1932 నుంచి ఒక్క‌సారి కూడా డెమాక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి గెల‌వ‌లేదు. ఉషారెడ్డి ఇప్పుడు కాన్సాస్‌లో డెమాక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిస్తే చ‌రిత్ర సృష్టించిన వార‌వుతారు.

కాన్సాస్ రాష్ట్రంలో మేయ‌ర్ అయిన మొద‌టి ఇండో - అమెరిక‌న్ కూడా ఉషారెడ్డినే. ఉషారెడ్డికి ర‌వి, శ్రీకాంత్‌, శాంతి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు కూడా అక్క‌డే స్థిర‌ప‌డ్డారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   13 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   40 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   3 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   18 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle