newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెరికాలో కరోనా విలయ తాండవం.. 40 మంది భారతీయులు బలి

12-04-202012-04-2020 10:15:21 IST
Updated On 12-04-2020 17:34:19 ISTUpdated On 12-04-20202020-04-12T04:45:21.954Z12-04-2020 2020-04-12T04:45:14.556Z - 2020-04-12T12:04:19.611Z - 12-04-2020

అమెరికాలో కరోనా విలయ తాండవం.. 40 మంది భారతీయులు బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాతో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఈ పోరాటంలో మృత్యుఘోష తప్పడం లేదు. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,830 మంది చనిపోయారు. దీనితో అక్కడ మరణాల సంఖ్య 20,577కి చేరింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 19,468 కరోనా మరణాలు చోటు చేసుకోగా.. అగ్రరాజ్యం ఆ మార్క్‌ను అధిగమించింది. ఇక అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 532,879 చేరింది.

అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో సుమారు 40 మంది కరోనా వల్ల మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 1,500 మందికి ఈ కోవిడ్ 19 సోకింది. మృతుల్లో కేరళకు చెందిన 17 మందితో పాటు ఆంధ్రప్రదేశ్ 2, ఒడిశా 1, గుజరాత్‌కు చెందిన 10 మంది, పంజాబ్‌కు చెందిన నలుగురు చనిపోయినట్లు భారతీయ సమాజ పెద్దలు వెల్లడించారు.

అటు న్యూజెర్సీలో ఉంటున్న 400 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అమెరికాలో ఉంటున్న 1000 మందికి పాజిటివ్ తేలిందని అక్కడి భారతీయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక న్యూయార్క్‌లో అయితే కరోనా బారిన ఎక్కువగా ట్యాక్సీ డ్రైవర్లు పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించడమే కాదు.. ఆయా దేశాల శక్తిసామర్థ్యాలను సైతం ప్రపంచానికి చాటుతున్నది. విపత్తు వేళ ఆయా దేశాలు వాయువేగంతో అధునాతన దవాఖానాలను నిర్మిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు వున్నా .రోజుకు దాదాపు 2వేల మంది మరణించడం అధ్యక్షుడు ట్రంప్క ను ఆందోళనలోకి నెట్టేస్తోంది.  కరోనావైరస్ ఇన్ఫెక్షన్లకు న్యూయార్క్ కేంద్రంగా మారిపోయింది.

కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఓ భారతీయ జర్నలిస్ట్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. చికాగో జైల్లో 478 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 304 మంది ఖైదీలు, 174 మంది జైలు సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల న్యూజెర్సీలో కరోనా కాటుకు ఇద్దరు భారతీయులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియన్ న్యూస్ ఏజెన్సీకి చెందిన మాజీ జర్నలిస్ట్ అమెరికాలో కరోనా సోకి మరణించారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ(UNI) మాజీ కాంట్రిబ్యూటర్, వెటరన్ ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల(66) కరోనా సోకి న్యూయార్క్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. ఇంకా ఎంతమంది ఈ మహమ్మారికి బలవుతారోనని ఆందోళన చెందుతున్నారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle