newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెరికాకు వెళ్లనే వెళ్లం. ఇండియానే సేఫ్: భారత్‌లో చిక్కుకున్న అమెరికన్ల ఘోష

30-04-202030-04-2020 10:38:07 IST
Updated On 30-04-2020 10:54:11 ISTUpdated On 30-04-20202020-04-30T05:08:07.799Z30-04-2020 2020-04-30T04:57:13.336Z - 2020-04-30T05:24:11.823Z - 30-04-2020

అమెరికాకు వెళ్లనే వెళ్లం. ఇండియానే సేఫ్: భారత్‌లో చిక్కుకున్న అమెరికన్ల ఘోష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిన్నమొన్నటి దాకా ప్రపంచమంతా అమెరికా కేసి చూసేది. భూమ్మీద సర్గధామంగా పేరుపొందిన అమెరికాలో అడుగుపెట్టడమంటేనే జీవితం పూల బాటలో నడిచినట్లుగా దేశదేశాల ప్రజలు భవిష్యదాశలతో అమెరికాకు పయనమయ్యేవారు. కానీ సరిగ్గా 3 నెలల్లో పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే కరోనా లౌక్ డౌన్ నేపధ్యంలో బయటిదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది అమెరికన్లు కరోనా వైరస్ నిర్మూలమయ్యేంతవరకు చస్తే అమెరికాకు వెళ్లమని భీష్మించుకుంటున్నారు అంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ప్రత్యేకించి భారత్‌లో ఉన్న పది వేలమంది అమెరికన్లకు కరోనాపై భారతదేశమే సమర్థంగా కట్టడి చేస్తోదని గాఢంగా విశ్వసిస్తున్నారు.

ఈ కారణం వల్లే భారత్‌లో ఉన్న అమెరికన్లు ఇప్పుడు తమ దేశం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కరోనా మహమ్మారిని అమెరికా కంటే భారతదేశమే సమర్థంగా కట్టడి చేస్తోందని వాళ్లు భావిస్తుండటమే దీనికి కారణం. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తామంటూ ఆ దేశ ప్రతినిధులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా సరే.. వీళ్లు అందుబాటులోకి రావడం లేదు. స్వయానా అమెరికా ప్రిన్సిపుల్‌ డిప్యూటీ సెక్రటరీ ఇయాన్‌ బ్రౌన్లీనే ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. 

విషయానికి వస్తే.. వ్యాపార, ఉద్యోగావసరాలతో పాటు పర్యాటకులుగా దాదాపు 10 వేల మంది అమెరికన్లు భారతదేశానికి వచ్చారు. కరోనా వైరస్‌ ప్రబలడంతో భారతదేశం లాక్‌డౌన్‌ ప్రకటించి.. అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేయడంతో వీరు ఇక్కడే చిక్కుకుపోయారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ వారు ఆందోళన చెంది.. తమను ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లాలని ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి ఈ–మెయిల్స్‌  పంపించి పేర్లు నమోదు చేసుకున్నారు. 

దీంతో ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది. మొదటి విడతలో నాలుగు వేల మంది అమెరికన్లను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి ఈ నెల రెండోవారంలో ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లారు. మిగిలిన ఆరు వేల మంది అమెరికన్లను తీసుకెళ్లేందుకు ఆ దేశ ప్రతినిధులు వీరి కోసం ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రాకుండా.. కొంతకాలం భారత్‌లోనే ఉంటామని పరోక్షంగా చెబుతున్నారు.

అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలు దాటగా.. 60 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో  కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని ఇండియాలో చిక్కుకుపోయిన అమెరికన్లే భావిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసులు 31 వేలే ఉన్నాయి.

ఈ విషయం కూడా భారత్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను ఆలోచనలో పడేసింది తిరిగి వెళ్లిన వారు వెళ్లిపోగా విమానాలు సిద్ధం చేస్తామని తమ రాయబార కార్యాలయం పదే పదే చెబుతున్నా వీరు మాత్రం ఇప్పట్లో తాము భారత్ నుంచి అమెరికాకు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.

మరోవైపు అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆదేశంలోనే మరికొంత కాలం ఉండటానికి వీసా పొడిగింపు కావలసి వస్తోంది. ఇలాంటివారిలో ఎక్కువమంది డాక్టర్లు, నర్సులే కావడంతో కరోనా వైరస్‌తో తలపడేందుకు వీరి సేవలు అమెరికాకు అవసరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను వదిలి వెళ్లడం భావ్యం కాదని కూడా వీరిలో చాలామంది అమెరికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. పైగా ఉన్నఫళాన అమెరికాను వదిలి భారత్ తిరిగి రావడం కూడా అనేక కారణాల వల్ల వీరికి సాధ్యం కాదు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle