newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమిత్ షా వ్యూహం సక్సెస్.. పౌరసత్వ బిల్లుకు ఓకె

12-12-201912-12-2019 08:23:45 IST
Updated On 12-12-2019 15:22:32 ISTUpdated On 12-12-20192019-12-12T02:53:45.829Z12-12-2019 2019-12-12T02:53:26.979Z - 2019-12-12T09:52:32.816Z - 12-12-2019

అమిత్ షా వ్యూహం సక్సెస్.. పౌరసత్వ బిల్లుకు ఓకె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హోంమంత్రి అమిత్ షా వ్యూహం విజయవంతం అయింది. రాజ్యసభలో ఎన్డీయేకి బలం లేకపోయినా బిల్లుకి ఆమోదం లభించింది. నిరసనలు, బంద్ లు జరుగుతున్నా.. కేంద్రం తన పంతం నెగ్గించుకుంది.

ట్రిపుల్ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు... అనంతరం వివాదాస్పద బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర లభించింది. పౌరసత్వ (సవరణ) బిల్లు బుధవారం రాజ్యసభ  ఆమోదించింది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. 

ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిఖ్‌ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు ఉద్దేశించారు. రాజ్యసభలో బిల్లుపై ఆరున్నర గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది.

ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని విపక్షాలు విమర్శించాయి. ఈ బిల్లుపై నెలకొన్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు హోం మంత్రి అమిత్ షా. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 

మిత్రపక్షాలు జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌తో పాటు అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ బిల్లుకు మద్దతివ్వడం విశేషం. పౌరసత్వ సవరణ బిల్లుకి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు ఇతర సవరణలను  సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది.

ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు, శివసేనకు చెందిన ముగ్గురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ, ఎన్సీపీలకు చెందిన ఇద్దరు చొప్పున ఎంపీలు, ఒక టీఎంసీ సభ్యుడు గైర్హాజరయ్యారు. ఉభయసభల ఆమోదం అనంతరం, బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి. అనంతరం చట్టంగా మారనుంది. 

కాంగ్రెస్‌ నేతలపై అమిత్‌ షా మండిపడ్డారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదన్నారు అమిత్ షా.  బిల్లు విషయంలో విపక్షాలు ముస్లింలకు తప్పుడు సమాచారం పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు.

పౌరసత్వ బిల్లు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలోనే ఉందని, దానికి అనుకూలంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారన్నారు. ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు తాము వ్యతిరేకం అన్నారు. 

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో మైలురాయి అవుతుందన్నారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అయితే, విపక్ష సభ్యులు ఈ బిల్లు న్యాయ సమీక్షకు నిలవదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle