అమిత్ షా వర్సెస్ ఓవైసీ... మాటల యుద్ధం
16-07-201916-07-2019 09:34:08 IST
Updated On 16-07-2019 10:32:39 ISTUpdated On 16-07-20192019-07-16T04:04:08.137Z16-07-2019 2019-07-16T04:04:04.461Z - 2019-07-16T05:02:39.225Z - 16-07-2019

బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా-హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వీరిద్దరూ లోక్ సభలో మాటల దాడికి దిగారు. భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు ఎన్ఐఏకి అధికారాలివ్వాలని కేంద్రం నిర్ఱయించింది. దీనికి సంబంధించిన బిల్లుపై లోక్‌సభ సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా-అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటామాటా పెరిగింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడారు, ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు. ఆ మాటకు వెంటనే స్పందించిన హైదరాబాద్ ఎంపీ ఒవైసీ దానికి అభ్యంతరం తెలిపారు. ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టలేదన్నారు. అనంతరం ఈ బిల్లుని లోక్ సభ ఆమోదించింది. ఈ కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేయడానికి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. బిల్లు ఆమోదం అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. జాతీయవాదులు, జాతివ్యతిరేకులు అని తేల్చేందుకు బీజేపీ దుకాణమేదైనా షురూ చేసిందా. హోం మంత్రి అమిత్‌షా మావైపు వేలు చూపించి బెదిరించేయత్నం చేశారు. ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే. దేవుడు కాదు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి ఆయన నిబంధనలు చదువుకోవాలి’’ అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా