newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమిత్ షా మరో చిచ్చుపెట్టారా?

16-09-201916-09-2019 08:44:49 IST
2019-09-16T03:14:49.492Z16-09-2019 2019-09-16T03:11:17.551Z - - 22-04-2021

అమిత్ షా మరో చిచ్చుపెట్టారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమిత్ షా డేర్ అండ్ డ్యాషింగ్ హోం మినిప్టర్.. గతంలో ఏ హొంమంత్రి నడవని రీతిలో ఆయన నడుస్తున్నారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు.. అంటూ ఆయన దూకుడు ప్రతిపక్షాలకు మింగుడుపడడం లేదు.

‘ఒకే దేశం.. ఒకే మతం.. ఒకే భాష’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో చిచ్చు రేపాయి. 

.భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందన్నారు. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

భారతీయులంతా ఇప్పటినుంచి హిందీ మాట్లాడటంపై ఎక్కువ దృష్టి పెట్టాలని.. తద్వారా మహాత్మాగాంధీ,సర్దార్ పటేల్ కలలను నిజం చేయాలని మరో ట్వీట్‌లో అమిత్ షా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

అందరూ హిందీలోనే మాట్లాడాలని , అంతర్జాతీయంగా కూడా దేశానికి మేలు జరుగుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు, కర్నాటకలో భాషాభిమానం మెండు. అమిత్‌షా వ్యాఖ్యలపై జేడీఎస్‌ అగ్రనేత, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, కాంగ్రెస్‌ నేత సిద్దారామయ్య, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు అమిత్ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలనుకోవడాన్ని నిరసిస్తూ పలు సంఘాలు రోడ్డెక్కాయి.తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటకలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. తమిళనాడు లోని ఎండీఎంకే కూడా నిరసన తెలిపింది. అమిత్ షా వ్యాఖ్యలను పీఎంకే ఖండించింది. ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ కూడా షా వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

మతం, భాష ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పన్నాగాలు పన్నుతున్నాయని కాంగ్రెస్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించింది. దేశాన్ని విడగొట్టడమే వీరి ఎజెండా అని దుయ్యబట్టింది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle