అమిత్ షా డిశ్చార్జ్..!
18-09-202018-09-2020 13:00:17 IST
2020-09-18T07:30:17.577Z18-09-2020 2020-09-18T07:30:15.066Z - - 19-04-2021

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకడంతో మేదాంత ఆసుపత్రిలో ఆగస్ట్ 2న అమిత్ షా చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకుని ఆగస్ట్ 14న డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెప్టెంబర్ 13న మళ్లీ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అమిత్ షా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అమిత్ షా పూర్తీ ఆరోగ్యంతో ఉన్నారని తెలియడంతో ఆయన అనుచరులు, సన్నిహితులు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. 55 సంవత్సరాల అమిత్ షా ఆగస్టు 2వ తేదీన కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన్ను గురు గ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలోకి చేర్చారు. ఆగస్టు 14న డిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేశారు. ఆగస్టు 18న మళ్ళీ ఆయన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చేరారు. 13 రోజుల పాటూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆగస్టు 31న హోమ్ మినిస్టర్ రికవర్ అయ్యారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల కిందట రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఆసుపత్రిలో మరోసారి జాయిన్ అయ్యారు. తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం నుండి వర్షాకాల సమావేశాలకు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. పార్లమెంటు సమావేశాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు. ఇప్పటికే కరోనా పలువురు రాజకీయ నాయకులను కబళించి వేసింది. పలువురు నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. 785 మంది పార్లమెంటు మెంబర్లలో 200 మంది 65 సంవత్సరాల పైబడి ఉన్న నేతలు ఉన్నారు. పార్లమెంటు సెషన్లకు ముందు పలువురు నేతలకు కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారెంటైన్ లో ఉంచారు.

ఏపీలో స్కూల్స్ బంద్
2 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
an hour ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
6 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
7 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
3 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
10 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
2 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
4 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
10 hours ago
ఇంకా