newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమిత్ షా ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్...

13-09-202013-09-2020 18:16:13 IST
2020-09-13T12:46:13.450Z13-09-2020 2020-09-13T12:45:43.766Z - - 14-04-2021

అమిత్ షా ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మరోసారి ఆసుపత్రికి వెళ్లడంపై పలువురు నేతలు, అభిమానులు కలవరాన్ని వ్యక్తం చేశారు.  అమిత్ షా మరోసారి అనారోగ్యం బారిన పడడంతో శనివారం రాత్రి ఆయన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకూ ఆయనకు ఏమైంది అని పలువురు ఆరాతీస్తూ ఉండగా.. ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు తాజాగా ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.

అమిత్ షాను ఆగస్టు 30న డిశ్చార్జి చేశామని, కానీ డిశ్చార్జి సమయంలో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆయన పూర్తి హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇంకో ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న ప్రకటన రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

55 సంవత్సరాల అమిత్ షా ఆగస్టు 2వ తేదీన కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన్ను గురు గ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలోకి చేర్చారు.  ఆగస్టు 14న డిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేశారు. ఆగస్టు 18న మళ్ళీ ఆయన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చేరారు. 13 రోజుల పాటూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆగస్టు 31న హోమ్ మినిస్టర్ రికవర్ అయ్యారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.  గత రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఆసుపత్రిలో మరోసారి జాయిన్ అయ్యారు. తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సోమవారం నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ లోపల సభ్యుల మధ్య భౌతికదూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఎల్‌సీడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో 257 మంది లోక్‌సభ హాల్లో, 172 మంది లోక్‌సభ గ్యాలరీలో, 60 మంది రాజ్యసభలో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.  

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle