అమిత్ షాకు మళ్లీ ఏమైంది..!
13-09-202013-09-2020 11:20:51 IST
Updated On 13-09-2020 11:31:06 ISTUpdated On 13-09-20202020-09-13T05:50:51.169Z13-09-2020 2020-09-13T05:50:45.462Z - 2020-09-13T06:01:06.111Z - 13-09-2020

కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. శనివారం రాత్రి ఆయన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల క్రితం కరోనా సోకగా కోలుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయనకు మరోసారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పోస్ట్ కొవిడ్ కేర్ కోసం తిరిగి ఆసుపత్రిలో చేరారు. రెండు వారాల క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తన విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఆయన మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. శనివారం రాత్రి ఒంట్లో బాగుండకపోవడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. 55 సంవత్సరాల బీజేపీ నేత ఆగస్టు 2వ తేదీన కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన్ను గురు గ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలోకి చేర్చారు. ఆగస్టు 14న డిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేశారు. ఆగస్టు 18న మళ్ళీ ఆయన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చేరారు. 13 రోజుల పాటూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆగస్టు 31న హోమ్ మినిస్టర్ రికవర్ అయ్యారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గత రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఆసుపత్రిలో మరోసారి జాయిన్ అయ్యారు. తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. సోమవారం నుండి పార్లమెంట్ మొదలు కానుంది. కోవిద్-19 సేఫ్టీ పద్దతులను పాటించనున్నారు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు తప్పనిసరిగా ధరించడమే కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. 785 మంది పార్లమెంట్ సభ్యుల్లో 200 మంది 65 సంవత్సరాలకు పైబడి ఉన్నారు. ఏడు మందికి పైగా యూనియన్ మినిస్టర్లు, రెండు డజన్లకు పైగా నేతలు కోవిద్-19 నుండి రికవరీ అయ్యారు. గత కొద్దిరోజులుగా భారత్ లో కోవిద్ కేసులు చాలా ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే..! పార్లమెంటులో కోవిద్-19 రూల్స్ ను నేతలు ఎలా పాటిస్తారో ప్రజలంతా చూడబోతున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
14 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా