అమిత్‌షాకు రజనీ కౌంటర్..!
18-09-201918-09-2019 16:25:52 IST
2019-09-18T10:55:52.738Z18-09-2019 2019-09-18T10:51:16.106Z - - 12-04-2021

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కౌంటర్ ఇచ్చారు. బలవంతంగా హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎవరూ ఒప్పుకోరని కుండబద్దలు కొట్టాడు. ఇది మంచిపద్దతి కాదని సూచించారు. బుధవారం ఈమేరకు ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేయడం అసాధ్యమని అన్నారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంపైనా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండటం మంచిదే అయినప్పటికీ.. విభిన్న సంస్కృతులు, వేర్వేరు భాషలను మాట్లాడుతున్న భారత్ లో అది సాధ్యపడదని అన్నారు. హిందీ మాత్రమే కాదని, ఏ భాషనైనా దేశం మొత్తం మీద అమలయ్యేలా చేయడం సరికాదని రజినీకాంత్ స్పష్టం చేశారు.
బలవంతంగా అమలు చేయాల్సి వస్తే.. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని చెప్పారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా హిందీని అమలు చేయడానికి ముందుకు వస్తాయని తాను అనుకోవట్లేదని అన్నారు. ఇదిలా ఉంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనసరిగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పట్ల చెలరేగిన దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీల నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సైతం.. అమిత్ షా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తేల్చి చెప్పారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం, తమిళనాడుకు చెందిన డీఎంకే, మక్కళ్ నీథి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ దీనిపై స్పందించారు. తాజాగా ఇదే విషయంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తన నోరు విప్పారు. బీజేపీ సానుభూతిపరునిగా గుర్తింపు ఉన్న రజినీకాంత్.. ఆ పార్టీ సుప్రీమ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా