అమర్త్య సేన్ నోట సీఏఏ మాట.. రాజ్యాంగస్ఫూర్తికిది వ్యతిరేకం
09-01-202009-01-2020 15:41:24 IST
2020-01-09T10:11:24.210Z09-01-2020 2020-01-09T10:11:21.079Z - - 23-04-2021

పౌరసత్వ చట్టం గురించి వివిధ రాజకీయపార్టీలు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ ప్రముఖ వ్యక్తి సీఏఏపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ఆయన ఎవరో కాదు నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్. సీఏఏ గురించి అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని,మతపరమైన వ్యత్యాసాలను పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించాలని అమర్త్యసేన్ కోరారు. బెంగళూరులో అమర్త్యసేన్ మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుందన్నారు. మతం పేరుతో అణచివేతకు గురి చేయాలని భావించడం తగదన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలలో కూడా చర్చ జరగాలని అమర్త్యసేన్ కోరారు. మన దేశానికి వెలుపల ఉన్న హిందువులపై కూడా సానుభూతి చూపాల్సిందేనని, వారిన పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు. సీఏఏ అనేది మతాలకు అతీతంగా నిర్ణయించాలని, ఎవరినీ ఇబ్బందిపెట్టకూడదన్నారు. మతంపేరుతో పౌరసత్వం ఇవ్వాలని మన రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదన్నారు. సీఏఏ వల్ల ప్రజల్లో అశాంతి నెలకొంటుదన్నారు. జేఎన్యూలో విద్యార్ధులపై దాడిని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన సమయంలో యూనివర్శిటీ అధికారులకు-పోలీసులకు మధ్య సమన్వయలోపం వల్ల విద్యార్ధులు ఎక్కువగా గాయపడ్డారన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు జరుగుతున్న వేళ అమర్త్యసేన్ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
a day ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా