newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్నాడీఎంకె కొత్త టెన్షన్

10-06-201910-06-2019 09:07:56 IST
Updated On 24-06-2019 12:59:40 ISTUpdated On 24-06-20192019-06-10T03:37:56.560Z10-06-2019 2019-06-10T03:36:49.289Z - 2019-06-24T07:29:40.211Z - 24-06-2019

అన్నాడీఎంకె కొత్త టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌లు త‌మిళనాడు అధికార పార్టీలో చిచ్చు పెట్టాయ‌ట‌. మొత్తం 38 ఎంపీ సీట్లున్న త‌మిళ‌నాడులో మొన్న‌టి ఎన్నిక‌ల్లో భారీగా న‌గ‌దు ప‌ట్టుప‌ట‌డంతో వెల్లూరు ఎంపీ సీటులో పోలింగ్ ర‌ద్దు అయింది. పుదుచ్చేరి సీటులో పాటు మిగిలిన స్థానాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 37 సీట్లు డీఎంకే నేతృత్వంలోని యూపీఏ గెల్చుకుంటే, కేవ‌లం ఒక్క‌సీటులోనే అన్నాడీఎంకే గెల్చుకుంది. అది కూడా థేని సీటు నుంచి పోటీ చేసిన ప‌న్నీర్ సెల్వం కుమారుడు ర‌వీంద్ర‌నాథ్ కుమార్ మాత్ర‌మే గెలిచాడు. 

ఇక 22 అసెంబ్లీ సీట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవ‌లం 9 సీట్ల‌లోనే గెలిచింది. ఈ దారుణ ఓట‌మితో ఇప్పుడు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాల మ‌ధ్య వివాదం మొద‌లైంద‌ట‌. ఒక పార్టీ మీద ఇద్ద‌రు నేత‌ల పెత్త‌నం ఉండ‌ట‌మే ఓట‌మికి కార‌ణ‌మంటూ పార్టీ నేత‌లు వీరిద్ద‌రినీ దుమ్మెత్తి పోస్తున్నారు.

పార్టీ మీద ఒక‌రి క‌మాండ్ మాత్ర‌మే ఉండాల‌నీ, ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాల‌ను పెంచుకునే ప్ర‌య‌త్నంలో పార్టీని నాశ‌నం చేస్తున్నారంటూ చాలా మంది నేత‌లు బ‌హిరంగంగానే ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం మీద మండిప‌డుతున్నార‌ట‌. పార్టీ ప‌రిస్థితి అర్థం చేసుకున్న చాలా మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దిన‌క‌ర‌న్ పార్టీ అమ్మ మ‌క్క‌ళ్ మున్నేట్ర క‌గ‌జంలోకి జంప్ చేస్తున్నార‌ట‌. 

దీంతో జిల్లాల్లో భారీగా క్యాడ‌ర్ కోల్పోతున్న అన్నాడీఎంకే, దిద్దుబాటు చ‌ర్య‌ల మీద దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. పార్టీలో ఒర‌కి ఆదేశ‌మే అమ‌లు కావాల‌నీ, ఈ విష‌యం మీద చ‌ర్చించాలంటూ ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

2021లో త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టంతో, ఇప్ప‌టి నుంచే పార్టీని గాడిలో పెట్టాల‌నీ, అలా చేయ‌క‌పోతే అధికారంతో పాటు అన్ని విధానా ఇబ్బందులు ప‌డ‌తామ‌న్న నిర్ణ‌యానికి ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం వ‌చ్చిన‌ట్లు త‌మిళ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. మ‌రోవైపు 2021లో జ‌రిగే ఎన్నిక‌ల్లో కూడా త‌మ పార్టీ విజ‌యం సాధించి అధికారం నిల‌బెట్టుకుంటుంద‌ని ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   8 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   35 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   3 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   18 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle