newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

05-04-202005-04-2020 07:56:58 IST
Updated On 05-04-2020 08:40:00 ISTUpdated On 05-04-20202020-04-05T02:26:58.165Z05-04-2020 2020-04-05T02:26:45.652Z - 2020-04-05T03:10:00.904Z - 05-04-2020

అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావ‌త్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా మ‌హమ్మారి ఇప్పుడు మ‌న దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలో ఎక్కువ జ‌నాభా క‌లిగిన రెండో పెద్ద దేశ‌మైన భార‌త్ క‌రోనా వైర‌స్‌ను ఎలా ఎదుర్కుంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో పాటు ప్ర‌పంచ దేశాలు మ‌న వైపు చూస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాల‌తో పోల్చితే మ‌న వ‌ద్ద క‌రోనా కేసులు త‌క్కువ‌గానే ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో క‌రోనాను ఎదుర్కోవాల‌నేది మ‌న ప్ర‌భుత్వాల మాట‌.

ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్‌పై పోరులో భాగంగా మ‌న ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు గానూ ఇవాళ రాత్రి తొమ్మ‌ది గంట‌ల‌కు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆపేసి దీపాలు వెలిగించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ విధించ‌డానికి ముందు కూడా మార్చ్ 22న ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

ఈ పిలుపున‌కు ఊహించ‌ని స్థాయిలో స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌జ‌లంతా క‌ర్ఫ్యూలో పాల్గొన్నారు. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌గా చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని మోడీ చెప్పారు.

ఆయ‌న పిలుపుమేర‌కు పేద‌, ధ‌నిక‌, సామాన్య‌, సెల‌బ్రిటీ అనే తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క దేశ పౌరుడు చ‌ప్ప‌ట్లు కొట్టారు. క‌రోనా వైర‌స్‌పై అంద‌రిలో అవ‌గాహ‌న తేవ‌డానికి ఈ కార్య‌క్ర‌మం బాగా ఉప‌యోగ‌ప‌డింది. దేశ‌మంతా లాక్‌డౌన్‌కు వెళ్లేముందు ప్ర‌జ‌లను క‌రోనా విప‌త్తును ఎదుర్కునేందుకు స‌మాయ‌త్తం చేయ‌డానికి ఈ పిలుపు ఉపయోగ‌ప‌డింది. ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హాలో తొమ్మిది గంట‌ల‌కు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆపి దీపాలు వెలుగించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

కొంద‌రు అత్యుత్సాహంతో వాట్సాప్‌ల‌లో చెబుతున్న‌ట్లుగా ఈ పిలుపు వెనుక జ్యోతిష్యంగా, న‌వ‌గ్ర‌హాలు, సైన్స్ ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, మ‌న త‌రంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దేశ‌మంతా క‌రోనా విప‌త్తును ఎదుర్కుంటున్న స‌మ‌యంలో మ‌న‌లో ఐక్య‌త‌కు ప్ర‌ధాని పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాజ‌కీయంగా మోడీ అనే వ్య‌క్తిని కొంద‌రు ఇష్ట‌ప‌డ‌వ‌చ్చు, మ‌రికొంద‌రు ఆయ‌న‌ను వ్య‌తిరేకించ‌వ‌చ్చు. కానీ, ఇటువంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశాన్ని న‌డిపించే ప్ర‌ధాని చెప్పిన మాట విని ఒక తొమ్మిది నిమిషాలు లైట్లు ఆపేసి దీపాలు వెలిగించ‌డం మ‌న ఐక్య‌త‌ను సూచిస్తుంద‌ని చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌ధాని ఈ పిలుపు ఇవ్వ‌గానే కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇప్ప‌టికే లాక్‌డౌన్ కార‌ణంగా వాణిజ్య‌, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు విద్యుత్ వాడ‌కం పూర్తిగా త‌గ్గిపోయింది. ఈ నేప‌థ్యంలో ఒకేసారి దేశ‌మంతా తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆపేస్తే విద్యుత్ వినియోగం ఒక్క‌సారిగా ప‌డిపోయి విద్యుత్ గ్రిడ్లు కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఒక‌సారి గ్రిడ్లు కూలిపోతే మ‌ళ్లీ పున‌రుద్ధ‌రించ‌డానికి రెండు, మూడు రోజులు ప‌డుతుంద‌నే వాద‌న‌లు వినిపించాయి. అయితే, ఈ ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని నిపుణులు అంటున్నారు.

తెలంగాణ‌లో గ‌త సంవ‌త్స‌రం ఈదురుగాలుల కార‌ణంగా ఒకేసారి పెద్ద ఎత్తున విద్యుత్ వాడ‌కం త‌గ్గిపోయింద‌ని, అయినా గ్రిడ్ల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌లేద‌ని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్‌రావు గుర్తు చేస్తున్నారు. తాము అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని, కేవ‌లం లైట్లు ఆర్పేయ‌డం ద్వారా గ్రిడ్ల‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న చెబుతున్నారు.

మ‌రోవైపు కేంద్రం కూడా ప‌లు సూచ‌న‌లు చేసింది. ప్ర‌ధాని పిలుపుమేర‌కు కేవ‌లం లైట్లు మాత్ర‌మే ఆపేయాల‌ని, ఫ్యాన్లు, టీవీలు వంటి ఇత‌ర వ‌స్తువుల‌ను, స్ట్రీల్ లైట్ల‌ను ఆపేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం సూచించింది. కాబ‌ట్టి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించి మ‌న ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle