అనిల్ అంబానీకి కోర్టు షాక్... డబ్బులు కట్టాల్సిందే అని ఆర్డర్
11-03-202011-03-2020 10:14:02 IST
Updated On 11-03-2020 11:35:13 ISTUpdated On 11-03-20202020-03-11T04:44:02.649Z11-03-2020 2020-03-11T04:43:13.041Z - 2020-03-11T06:05:13.844Z - 11-03-2020

ఒకతండ్రికి ఇద్దరు కొడుకులు.. తండ్రేమో పెద్ద వ్యాపారవేత్త. పెద్దకొడుకు ప్రపంచంలోనే పెద్ద సంపన్నుడు., కానీ చిన్నకొడుకు మాత్రం దివాలా తీశాడు. కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఈ కథ ఎవరి గురించో మీకు తెలుసు కదా. భారతదేశ పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబానీ ఇద్దరు కొడుకులు ముఖేష్, అనిల్ అంబానీలు. ముఖేష్ బిలియనీర్ గా ప్రఖ్యాతి పొందారు. కానీ అనిల్ అంబానీకి మాత్రం అప్పులు వేధిస్తున్నాయి. తాజాగా లండన్ కోర్టు ఆదేశాలు షాకిచ్చాయి. లండన్ హైకోర్టులో అనిల్ అంబానీకి చెందిన కేసు విషయంలో ఆసక్తికర వాదనలు జరిగాయి. అనిల్ అంబానీ అప్పులు చెల్లించే పరిస్థితి లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే. 337 కోట్ల రూపాయల విలాసవంతమైన విహార పడవ, 579 కోట్ల రూపాయల) బోయింగ్ జెట్ ప్రైవేటు విమానంతోపాటు ముంబైలో 19 వేల కోట్ల రూపాయల విలువైన 27 అంతస్తుల కుటుంబ భవనం కలిగిన అనిల్ అంబానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏంటి?’ అంటూ లండన్ హైకోర్టులో మూడు చైనా బ్యాంకుల తరఫున న్యాయవాది అనిల్ అంబానీని ఉద్దేశించి వాదించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్ దీనిపై జోక్యం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితం అనుభవించిన మీకు ఎన్ని ఆస్తులున్నాయో మాకు తెలుసు. ఒకప్పుడు ప్రైవేటు హెలికాప్టర్లో తిరిగిన మీరు బొంబార్డియర్ లెగసీ 650 ప్రైవేటు జెట్ విమానంలో తిరుగుతున్నారు. 22 కోట్ల రూపాయలు విలువైన 11 కార్లు మీ కుటుంబానికి ఉన్నాయి. ఖరీదైన భవనాలున్నాయి. చెల్లించడానికి మీ వద్ద డబ్బు లేకపోవడం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 20వ తేదీలోగా రూ 772 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిందే అని అనిల్ అంబానీని ఆదేశించారు. 2008లో ఆర్థిక మాంద్యం వల్ల రిలయెన్స్ కమ్యూనికేషన్ల తీవ్రంగా నష్టపోయింది. దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయన 2012లో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 5,310 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ అనిల్ అంబానీ వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో చైనాకు చెందిన మూడు బ్యాంకులు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మేరకు లండన్ హైకోర్టులో కేసు వేశాయి. 2019 డిసెంబర్లో ఈ కేసు విచారణ జరిగింది. తాజాగా మరోసారి కేసు విచారణకు వచ్చింది. ఈసందర్భంగా అనిల్ అంబానీ తన ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. అంబానీ షేర్ల విలువ మొత్తం 63.7 మిలియన్లు అని, నగదు జీరో అని, తాను రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేనని అనిల్ అంబానీ వాదించారు. ఆ సమయంలో చైనా బ్యాంకుల న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్, అంబానీని నిలదీశారు. దానికి సమాధానంగా గతంలో స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు తాను చెల్లించాల్సిన 60 మిలియన్ పౌండ్లను తన సోదరుడు ముకేశ్ అంబానీ చెల్లించారని, ఇంకేమాత్రం తన అప్పులు చెల్లించేందుకు ఆయన సిద్ధంగా లేరని అనిల్ అంబానీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రుణాల చెల్లింపు గురించి తదుపరి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామంటున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా