newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనవసర ప్రయాణాలు ఆపకపోతే బస్సులు, రైళ్లు బంద్: ఉద్ధవ్ థాక్రే వార్నింగ్

19-03-202019-03-2020 09:41:50 IST
2020-03-19T04:11:50.648Z19-03-2020 2020-03-19T04:11:47.879Z - - 12-04-2021

అనవసర ప్రయాణాలు ఆపకపోతే బస్సులు, రైళ్లు బంద్: ఉద్ధవ్ థాక్రే వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ప్రజలు అనవసరంగా ప్రయాణాలు చేయడం ఆపకపోతే బస్సులు, రైళ్లు అపివేయవలసి వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాకపోకలు, ప్రయాణాలు ఆపుకోవాలని ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజలు పాటించకపోవడంతో నిర్బంధంగా అయనా రాకపోకలను అడ్డుకోవాలని శివసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇప్పటికే పుకార్లతో సతమవుతున్న ఉద్దవ్ ప్రభుత్వం రాష్ట్రంలో వారం రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలు వదిలి సెలవుపై వెళ్లిపోతున్నారన్న వార్తలు హల్ చల్ చేయడంతో వాటిని తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వోద్యోగుల సెలవుల గురించి ఒక సెక్షన్ మీడియాలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. 

దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకు ఉద్ధవ్ ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. స్కూళ్లు విద్యాలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, సామూహిక ఉత్సవాలు వంటివి మూసివేసినా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఇళ్లపట్టునే ఉండిపోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్దేశాన్ని లెక్కచేయకుండా ప్రజలు ఇంకా ప్రయాణాలు చేస్తుండటంతో అతిగా, అనవసరంగా ప్రయాణాలు పెట్టుకుంటే బస్సులు, రైళ్లను కూడా బంద్ చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ కార్యాలయాలను సగం సిబ్బందితో నడిపిస్తామని, ఉద్యోగులందరికీ ఏడు రోజులు సెలవులు ఇస్తామనడం సత్యదూరమని ఉద్దవ్ చెప్పారు. 

ఇంతవరకు మహారాష్ట్రలో 50 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా రోగి ఒకరు మరణించడంతో ప్రభుత్వం వ్యాధి నిరోధక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. 40 మంది కరోనా పాజిటివ్ రోగుల పరిస్థితి నిలకడగా ఉందని వీరిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారని థాక్రే పేర్కొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle