అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
07-12-201907-12-2019 15:12:58 IST
Updated On 11-12-2019 12:36:33 ISTUpdated On 11-12-20192019-12-07T09:42:58.692Z07-12-2019 2019-12-07T09:42:55.778Z - 2019-12-11T07:06:33.943Z - 11-12-2019

మహిళలు రాజకీయాల్లో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంటేనే అత్యాచారాలను అరికట్టడం సాధ్యపడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సాహస ప్రకటన చేశారు. మహిళలపై నేరాలను రాజకీయసమస్యగా చూడకుండా మహిళల భద్రతకు చెందిన విషయంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. లక్నోలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రియాంకా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహిళలు అధికారంలోకి రావాలని నా అభిప్రాయం. హింసకు వ్యతిరేకంగా పంచాయితీ, శాసన సభలకు పోటీ చేసి రాజకీయాల్లోకి రండి. తద్వారా మీకు అధికారం లభిస్తుంది. దాంతో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టవచ్చ’ని పేర్కొన్నారు. మహిళల హక్కులు, భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలలో పోరాడుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో పెరుగుతున్న నేరాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మహిళలు జనాభా దామాషా ప్రకారం పురుషుల నుంచి అధికారాన్ని లాక్కోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు. రాష్ట్రంలో గత 11 నెలల్లో దాదాపు 90 అత్యాచార కేసులు నమోదయ్యాయని, మహిళలపై జరుగుతున్న నేరాల కేసుల్లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. ఉదాహరణగా ఉన్నావ్ ఘటనను ప్రస్తావించారు. ఈ కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యేను రక్షించడానికి ప్రభుత్వం చివరి వరకు ప్రయత్నించిందని ఆరోపించారు. చివరికి కోర్టు ఆదేశాలతో నాలుగు నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా బాధితురాలు చేస్తున్న పోరాటం ఒక యుద్ధంతో సమానమని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేను కాపాడి నిందితుల పక్షాన ఉంటుందా లేక బాధితురాలి పక్షాన ఉంటుందా అనేది తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టడానికి తీసుకోదగిన చర్యలను వివరించారు. ఇది రాజకీయ సమస్య కాదని, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల భద్రతకు సంబంధించిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ‘శాంతి భద్రతలు కాపాడడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ఎప్పుడైనా చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అయితే ఎన్కౌంటర్ ఘటన గురించి తనకు పూర్తి వివరాలు తెలియవు. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడడం మంచిది కాద’ని వివరించారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చివరి క్షణం వరకు నేరస్థుల పక్షాన్నే నిలిచిందని, ఈ నేపథ్యంలో బాధిత మహిళ, ఆమె కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై యుద్ధం చేయడం ఎంత కష్టమో అర్థమవుతుందని ప్రియాంక వ్యాఖ్యానించారు.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా