అద్వానీ ప్రారంభించారు.. మోదీ ముగించారు
10-11-201910-11-2019 10:24:59 IST
2019-11-10T04:54:59.361Z10-11-2019 2019-11-10T04:54:51.434Z - - 19-04-2021

శతాబ్దాల వివాదానికి స్వస్తి పలుకుతూ నవంబర్ 9న సుప్రీంకోర్టు అయోధ్య రామమందిరంపై తీర్పు ఇవ్వడానికి ముందు యావద్దేశం ఏం జరగుతుందోనని అట్టుడికిపోయిందంటే అతిశయోక్తి కాదు. కానీ శనివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్‌తో సహా అయిదు మంది సుప్రీంకోర్టు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు చెబుతున్నప్పుడు కానీ, తర్వాత కానీ కనీస నిరసనలు కూడా కనిపించకపోవడం ప్రపంచాన్నే దిగ్భ్రాంతిలో పడవేసింది. జాతి లౌకిక పునాదులనే కదిలించివేసిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటన తర్వాత పీట ముడివేసుకుపోయిన అయోధ్య సమస్యను ఇంత సునాయాసంగా, ఇంత శాంతియుతంగా కోర్టు పరిష్కరించగలిగినందుకు తెరవెనుక దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది ప్రపంచ స్థాయి చర్చనీయాంశంగా మారింది. అయోధ్యకు రధయాత్ర పేరిట హిందూత్వానికి రాజకీయపరంగానే తొలి ఊపును ఇచ్చిన ఘనత బీజేపీ కురువృద్ధ నేత లాల్ కృష్ణ ఆడ్వానీది కాగా.. దాన్ని తార్కికంగా ముగింపు వైపుకు తీసుకెళ్లిన ఘనత మోదీకి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు ఏకాభిప్రాయం. దేశాన్ని మతపరంగా రెండు ముక్కలుగా మార్చిన 1990ల నాటి ఉద్రిక్త పరిస్థితుల్లో హిందూత్వానికి తీవ్ర వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ ఆద్వానీ దాన్ని ముందుకు తీసికెళ్లారన్నది వాస్తవం. 1984 ఎన్నికల్లో పార్లమెంటులో 2 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ 1989నుంచి తిరుగులేని విజయాలు సాధించడానికి అద్వానీ నాయకత్వ ప్రభావమే కారణం. అప్పటినుంచి పదేళ్ల లోపే దేశాన్ని ఏలగల స్థాయికి ఆయన బీజేపీని తీసుకెళ్లారు. అద్వానీ ఇక బీజేపీని రాజకీయంగా, సైద్దాంతికంగా కూడా ముందుకు తీసుకెళ్లరన్న పరిస్తితుల్లో చరిత్ర నరేంద్రమోదీని ముందుకు నెట్టింది. వాజ్‌పేయి తర్వాత ఆయనకు మించిన జనాకర్షణతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం నుంచి మోదీ ప్రధాని పదవికి ఎగబాకారు. హిందూ జాతీయవాదాన్ని నినాదంగా చేసుకున్న మోదీ అన్ని పరిణామాలకూ సానుకూల ప్రోద్బలమిస్తుండటం కారణంగా హిందుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత అనేది తగ్గుముఖం పట్టి అది జాతి జీవితంలో హిందూత్వం ఒక సమ్మిళిత స్థాయికి చేరడం మోదీ హయాంలోనే సాధ్యమైంది. అన్ని వర్గాలూ హిందూత్వను ఆమోదించే స్థాయి వచ్చింది. ఈ మార్పే అయోధ్య తీర్పుకు ఓ భూమికగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అయోధ్య పరిష్కార విషయంలో మోదీ తన రాజకీయ జీవితంలోనే అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వివాదాస్పద స్థలంపై హక్కులను ముస్లింలు వదులుకుంటేనే మంచిది అన్ని అభిప్రాయాన్ని కీలక ముస్లిం సంస్థల నేతల్లో కలిగించారు. సుప్రీంకోర్టు ద్వారానే పరిష్కారం జరిగేట్లు, ఆ పరిష్కారాన్ని అందరూ ఆమోదించేట్లు అన్ని వర్గాలనూ ఒప్పించారు. హిందూ స్వామీజీలెవరూ నోరెత్తకుండా సంఘ్ ద్వారా కట్టడి చేయించారు. ముస్లింలలో ఏర్పడిన భిన్న వైఖరులను మోదీ అయోధ్య అంశానికి సానుకూలంగా మల్చుకున్నారు. తొలుత కోర్టు ద్వారా వచ్చిన మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను మోదీ నేతృత్వంలోని కేంద్రం ఓ అవకాశంగా తీసుకుని. మధ్యవర్తిత్వ చర్చలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్ఎం కలీఫుల్లా సారథ్యంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూతో కమిటీని నియమించింది. వారితో పాటు ఆరెస్సెస్ పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు వివిధ వర్గాలతో తెర వెనుక మంతనాలు జరిపారు. సున్నీ వక్ఫ్ బోర్డును వారు దాదాపు తమ దారికి తీసుకురాగలిగారు. వివాదాస్పద ప్రాంతం నుంచి తాము వైదొలగుతామని అంగీకరిస్తూ తమకు వేరే చోట మసీదు నిర్మించి ఇవ్వాలని, అయోధ్యలోని ఇతర మసీదులను కూడా ప్రభుత్వమే పునరుద్ధరించాలని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతిపాదించడం ఓ పెద్ద మలుపు. ఈ ప్రతిపాదనను మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకు సమర్పించిన తన నివేదికలో తెలియజేసింది. ఈ ప్రయత్నాలకు అదనంగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ముస్లిం నేతలతో తెర వెనుక చర్చలు జరిపారు. సెప్టెంబరు 30న ఢిల్లీలోని ఆరెస్సెస్ కార్యాలయంలో ఆయన జమియత్ ఉలేమా-ఎ-హింద్ నేత అర్షద్ మదానీతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చొరవ తీసుకుని ఆరెస్సెస్, బీజేపీ నాయకులకు ముస్లిం నేతలతో కనీసం 20 సమావేశాలు ఏర్పాటు చేయించారు. అయోధ్యపై శాంతియుత పరిష్కారానికి, తీర్పుకు ఈ అన్ని ప్రయత్నాలూ అంతిమంగా సత్ఫలితాలు ఇచ్చాయని సమాచారం. అయితే కోర్టు వెలుపల సెటిల్మెంట్ కంటే కోర్టు తీర్పు ద్వారా పరిష్కారం మంచిదని భావించి మోదీ కథ నడిపారు. మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక, సున్నీలు మనసు మార్చుకోవడం, మిగిలిన వర్గాల నుంచీ కూడా పెద్దగా వ్యతిరేకత రాకుండా చూసుకోవడం... వీటన్నింటినీ మోదీ-అమిత్ షా జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగడమే అయోధ్య వ్యవహారాన్ని మూల మలుపు తిప్పాయని విశ్లేషకుల అభిప్రాయం. అంతిమంగా బీజేపీ అగ్రనేతగా, ప్రధానిగా మోదీ సాధించిన ఘనవిజయాల్లో అయోధ్యకే టాప్ ర్యాంక్ అన్నదే అంతిమ సత్యం కోర్టు వెలుపలే ముస్లింలతో సమాలోచనలు.. సుప్రీం తీర్పును అంగీకరించేలా మంత్రాంగం నడపటం, సమ్మిళిత హిందూత్వ వాదంతో ముందుకెళ్లడం, సానుకూల వాతావరణం ఏర్పరిచి పరిష్కారానికి బాటలు ఏర్పర్చడం.. మోదీ వ్యక్తిత్వం, నాయకత్వ పటిమ శిఖరస్థాయినందుకున్న క్షణాల్లోనే అయోధ్య చిక్కుముడి సునాయాసంగా విడిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పాతికేళ్లక్రితం బీజేపీ అధినేత ఎల్.కె. అద్వానీ రగిల్చిన అయోధ్య జ్వాల 2019 నవంబర్ 9న మోదీ చొరవతో చల్లారింది. రాజకీయంగా తెరవెనుక సాగించిన అసంఖ్యాక ప్రయత్నాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేది ఒక సాంకేతికమైన అంతిమ పరిణామం మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది.

ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
an hour ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
6 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
7 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
10 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
2 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
4 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
10 hours ago
ఇంకా