newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

అదే బీజేపీ టార్గెట్ .. దీదీకి బెంగ

10-06-201910-06-2019 09:11:13 IST
Updated On 24-06-2019 12:55:49 ISTUpdated On 24-06-20192019-06-10T03:41:13.981Z10-06-2019 2019-06-10T03:40:41.463Z - 2019-06-24T07:25:49.033Z - 24-06-2019

 అదే బీజేపీ టార్గెట్ .. దీదీకి బెంగ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి ఇప్పుడు 2021లో జ‌రిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల మీద బెంగ పెట్టుకున్నార‌ట‌. ముఖ్యంగా మొన్న‌టి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు వెళ్లడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో 37.4 శాతం ఓట్ల‌ను రాబ‌ట్టుకున్న బీజేపీ, మ‌రో 10 శాతం ద‌ళితుల ఓట్ల‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోవ‌డాన్ని కూడా మ‌మ‌త దీదీ త‌ట్టుకోలేక పోతున్నట్లు బెంగాల్ మీడియా క‌థ‌నాలు రాస్తోంది. 

ప‌శ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న 30 శాతం ముస్లింల ఓట్ల కోసం మొద‌టి నుంచీ తాప‌త్ర‌య ప‌డుతున్న మ‌మ‌త బెన‌ర్జీ, ముస్లింల‌కు అనుకూలంగా తీసుకున్న అడ్డ‌గోలు నిర్ణ‌యాలే బీజేపీకి లబ్ది చేకూర్చాయ‌ని ఫ‌లితాల త‌ర్వాత తేలింది. ముఖ్యంగా మ‌మ‌త దీదీ, ముస్లిం ప‌క్ష‌పాతి అనీ, హిందూ వ్య‌తిరేకి అంటూ బీజేపీ, సంఘ్ ప‌రివార్ చేసిన ప్ర‌చారం జ‌నానికి బాగా ఎక్కింద‌ట‌. ప్ర‌ధానంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు జై శ్రీరాం అన్న‌ప్పుడ‌ల్లా రెచ్చిపోవ‌డం, వారిని అరెస్ట్ చేయించ‌డం మ‌మ‌త బెన‌ర్జీ బాగా నెగెటివ్ అయిన‌ట్లు తేలింది. 

అంతేకాదు, జై శ్రీరాం నినాదాలు చేసేవారు బెంగాలీలు కాద‌నీ, బెంగాలీలు ఆ ప‌ద‌మే ప‌ల‌క‌ర‌న్న రీతిలో కామెంట్ చేసిన మ‌మ‌త‌, పొరుగు రాష్ట్రాల నుంచి వ‌చ్చేవారే జై శ్రీరాం అంటున్నార‌ని ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌లో చెప్పుకొచ్చారు. ఇది బీజేపీకి ఎంత లాభం చేసిందో, టీఎంసీకి అంత న‌ష్టం చేసిందట‌. ఎందుకంటే, ఏటా శ్రీరామ‌న‌వ‌మి రోజున‌, బీజేపీకి పోటీగా టీఎంసీ బెంగాల్ వ్యాప్తంగా రామ‌యాత్ర‌లు చేస్తోంది. అలాంట‌ప్పుడు బెంగాలీలు జై శ్రీరాం ఎందుకు అన‌కూడ‌ద‌ని టీఎంసీ కార్య‌ర్త‌ల‌ను జ‌నం ప్ర‌శ్నించ‌డం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింద‌ట‌. 

మ‌మ‌త బెన‌ర్జీ ఆవేశాన్ని చూసిన కొంద‌రు వార‌ణాసి సాధువులు ఆమెకు ప‌దివేల శ్రీరామ చ‌రిత మాస‌న్ పుస్త‌కాలు పంపుతున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇదంతా చూస్తుంటే సొంత నిర్ణ‌యాల‌తో మ‌మ‌త బెన‌ర్జీ త‌న‌కు తానే ఉచ్చులో ప‌డ్డార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల చెబుతున్న మాట‌. ఒక్కోసారి బ‌హిరంగ స‌భ‌ల్లో స‌హ‌నం కోల్పోయి, వీధి రౌడీ త‌ర‌హాలో మ‌మ‌త బెన‌ర్జీ ప్ర‌వ‌ర్తించే వార‌నీ, అదంతా ఆమెకు చాలా మైన‌స్ అయింద‌ని కూడా చెబుతున్నారు. 

మ‌మ‌త దీదీ అస‌హ‌నం ఏ స్థాయికి వెళ్లిందంటే ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాలు జిల్లాలోని నైహ‌టి బీజేపీ ఆఫీసును బ‌ల‌వంతంగా ఆక్ర‌మించిన టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, ఆ భ‌వ‌నానికి తృణ‌మూల్ పార్టీ రంగులు వేయించి, జెండాలు క‌ట్టార‌ట‌. దీని మీద బీజేపీ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ట‌.

అంటే బీజేపీ మీద మ‌మ‌త బెన‌ర్జీకి ఏ స్థాయిలో కోపం ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్ని చూసిన టీఎంసీ కార్య‌క‌ర్త‌లు ఇబ్బంది ప‌డ‌టం, సొంత పార్టీలోనే ఆమె చుల‌క‌న అవ్వ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. 

మ‌రో విష‌యం ఏంటంటే, తన‌కు అన్ని మ‌తాలూ స‌మానం అని చెప్పే మ‌మ‌త బెన‌ర్జీ, ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌లో ముస్లింల సంతుష్టీక‌ర‌ణ ప్ర‌ద‌ర్శించార‌ని బెంగాల్ మీడియా తేల్చి చెబుతోంది. ఇదంతా ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాలు అయితే, తాజాగా, కోల్ కొతా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మ‌మ‌త బెన‌ర్జీ, ముస్లింల‌ను అవ‌మాన ప‌రిచే విధంగా మాట్లాడార‌ట‌.

ఒక ఆవు ఎన్నిసార్లు త‌న్నినా తాను బాధ‌ప‌డ‌న‌నీ, కానీ దాని పాలు మాత్రం ఎలాగైనా తాగుతానంటూ ఆ విందులో కామెంట్ చేశారు మ‌మ‌త బెన‌ర్జీ. 

అలాగే ముస్లింలు కూడా ఏం జ‌రిగినా బాధ‌ప‌డ‌వ‌ద్ద‌నీ, మంచి ఫ‌లితాల కోసం క‌ష్ట‌ప‌డాల‌ని కోరార‌ట మ‌మ‌త‌. ఇదే ఇప్పుడు బెంగాల్ ముస్లింల‌కు ఇబ్బందిగా మారింద‌ట‌. ఏం జ‌రిగినా అంటే, ఏదో జ‌రుగుతుంద‌న్న భ‌యం త‌మ‌లో ఉంద‌నీ, ఏకంగా ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తే ఈ విధంగా మాట్లాడ‌టం, త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని ముస్లింలు చెబుతున్నారు. మొత్తానికి త‌న‌కు తానే గొయ్యి త‌వ్వుకుంటున్న మ‌మ‌త బెన‌ర్జీ, సొంత నిర్ణ‌యాల‌తో బీజేపీ బ‌లం పెంచుకుంటూ పోతున్నార‌ట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle