newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అత్యాచార బాధితురాలనే అరెస్టు చేస్తారా.. మండిపడ్డ అఖిలేష్

27-09-201927-09-2019 09:35:17 IST
2019-09-27T04:05:17.001Z27-09-2019 2019-09-27T04:04:56.834Z - - 23-04-2021

అత్యాచార బాధితురాలనే అరెస్టు చేస్తారా.. మండిపడ్డ అఖిలేష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్యాచార బాధితురాలిగా వెలుగులోకి వచ్చిన లా విద్యార్థినిని అరెస్టు చేసిన గొప్ప ఖ్యాతి ఉత్తర ప్రదేశ్ బీజేపీ శాఖకు దక్కిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆక్షేపించారు. మాజీ బీజేపీ ఎంపీ చిన్మయానంద్ తనను ప్రలోభపెట్టి అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపిస్తూ రాష్ట్రానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపించడం సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

కానీ అధికార బీజేపీ సీనియర్ నేతకు వ్యతిరేకంగా తన వాణిని వినిపించే సాహసం చేసిన ఉత్తరప్రదేశ్ పుత్రికను జైలుకు పంపించడం ద్వారా బీజేపీ అసలు రంగు బయటపడిందని అఖిలేష్ ధ్వజమెత్తారు. ఈ సిగ్గుమాలిన చర్యతో ఈ దేశంలోని ప్రతి కుమార్తె, చెల్లి, తల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయారని, కానీ ఈ సమయంలోనే కొందరు వ్యక్యులు దేశంలో అంతా బాగుందని చెబుతున్నారని అఖిలేష్ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ కొద్ది రోజుల క్రితం తనను ఎవరయినా ప్రశ్నిస్తే భారత్‌లో అంతా బాగుందని చెబుతానంటూ పేర్కొనడం గమనార్హం.

అన్యాయం జరిగిందని చెబుతున్న అమ్మాయిలను కూడా జైల్లో పెట్టడం నిజంగా ఖండించదగిన విషయమని, కుమార్తెలను కాపాడదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నినాదం అబద్ధమని తేలిపోయిందని మాజీ సీఎం అఖిలేష్ విచారం వ్యక్తం చేశారు. 

అంతకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కూడా న్యాయశాస్త్ర విద్యార్థిని అరెస్టుపై తీవ్రంగా విమర్శించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలి తండ్రిని చంపారు. ఆమె చిన్నాన్నను అరెస్టు చేశారు.  ఆరోపణలకు గురైన బీజేపీ ఎమ్మెల్యేని 13 నెలల తర్వాత తీవ్రమైన ప్రజాందోళన నేపథ్యంలో అరెస్టు చేశారు. చివరకు బాధితురాలి కుటుంబాన్ని లేపేయ్యాలని ప్రయత్నించారు.

ఇక షాజాపూర్ అత్యాచారం కేసులో బాధితురాలినే ఇప్పుడు అరెస్టు చేశారు. పైగా బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిందితుడైన బీజేపీ నేత అరెస్టు విషయంలో పోలీసులు జాప్యం చేశారు. ప్రజల ఒత్తిడి కారణంగా తర్వాత అరెస్టు చేసినా, ఇంతవరకు అతడిపై అత్యాచార నేరారోపణ చేయలేదు. బీజేపీ న్యాయ పాలనను అభినందించాల్సిందే అంటూ ప్రియాంగ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో పలు ఆశ్రమాలను, విద్యాసంస్థలను నిర్వహిస్తున్న చిన్మయానంద తనకు న్యాయ కళాశాలలో ప్రవేశం విషయంలో సహాయం చేసిన తర్వాత లైంగికంగా వేధించారంటూ లా విద్యార్థిని ఆరోపించింది. హాస్టల్‌లోని బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా తన ఫోటోలు తీసి వీడియో చూపించి బెదిరించి మరీ తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది.

ఈ కేసు బహిరంగం కావడంతో ఆ న్యాయ విద్యార్థిని ఆగస్టు 24న ఫేస్‌బుక్‌లో తనను అత్యాచారం చేసిన రాజకీయనాయకుడి పేరు ప్రస్తావించకుండా విషయాన్ని పోస్ట్ చేసి తర్వాత అదృశ్యమైంది. సుప్రీంకోర్టు ఈ  విషయమై విచారణకు ఆదేశాలు జారీ చేసి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. 

కేసు విచారణలో ఉండగానేం ఆ అమ్మాయి ఆరోపణలకు గురైన చిన్మయానందను 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిందని, బెదిరించిందని, సాక్ష్యాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ బుధవారం యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అచ్చేదిన్ అన్నా, భారత్‌లో అంతా బాగుందన్నా ఇదేనా మోదీజీ.. మన పరువును ఎవరు ఏ గంగలో ముంచుతున్నారో తమరి దృష్టికి వస్తోందా?

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle