newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అతిపెద్ద మురికివాడ‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌

14-04-202014-04-2020 08:40:17 IST
Updated On 14-04-2020 10:22:39 ISTUpdated On 14-04-20202020-04-14T03:10:17.075Z14-04-2020 2020-04-14T03:10:12.325Z - 2020-04-14T04:52:39.711Z - 14-04-2020

అతిపెద్ద మురికివాడ‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టికే 2000కి క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా 149 మంది మ‌ర‌ణించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో, సంభ‌విస్తున్న మ‌ర‌ణాల్లో, మ‌ర‌ణాల రేటులోనూ మ‌హారాష్ట్ర ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌భుత్వం ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించింది.

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను, ప్ర‌త్యేకించి ముంబై వాసుల‌ను ఇప్పుడు ధారావిలో వేగంగా న‌మోద‌వుతున్న కేసులు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద మురికివాడ‌ల్లో ధారావి ఒక‌టి. దేశంలోనే పెద్ద మురికివాడ ఇది. కేవ‌లం 2.1 స్క్వేర్ కిలోమీట‌ర్ల ప‌రిధిలో విస్త‌రించి ఉన్న ధారావిలో సుమారు 10 ల‌క్ష‌ల మంది నివ‌సిస్తున్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. వీరంతా నిరుపేద‌లు. చిన్న చిన్న ప‌నులు చేసుకొని జీవ‌నం గ‌డిపే వారు. క‌నీస మౌళిక స‌ధుపాయాలు, పారిశుధ్య వ్య‌వ‌స్థ కూడా ధారావిలో లేదు. ఇటువంటి మురికివాడ‌లో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తే క‌ట్ట‌డి చేయ‌డం క‌ష్ట‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

ధారావిలో ఏప్రిల్ 1వ తేదీన మొద‌టి క‌రోనా పాజిటీవ్ కేసు న‌మోదైంది. కేవ‌లం 13 రోజుల వ్య‌వ‌ధిలోనే ఏప్రిల్ 13 నాటికి పాజిటీవ్ కేసుల సంఖ్య 47కి చేరింది. ఇప్ప‌టికే ధారావికి చెందిన ఐదుగురు క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు.

దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ధారావి ప‌ట్ల అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక బృందాలు ధారావిలో స‌ర్వే నిర్వ‌హిస్తున్నాయి. క‌రోనా ల‌క్ష‌ణాలు గుర్తించే ప‌నిలో ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మైంది. ఏకంగా 13 వేల మందికి క‌రోనా వైర‌స్ సంబంధించిన ల‌క్ష‌ణాలు పాక్షికంగానో, ఎక్కువ‌గానో ఉన్నాయ‌ని అధికారులు గుర్తించారు. వీరిలో అవ‌స‌ర‌మైన వారికి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డానికి శాంపుల్స్ సేక‌రిస్తున్నారు.

అయితే, ధారావి లాంటి ప్రాంతంలో భౌతిక దూరం పాటించ‌డం చాలా క‌ష్టం. ఇక్క‌డ 10 అడుగుల్లో ఉండే చిన్న‌చిన్న రేకుల ఇళ్ల‌లో క‌నీసం 10 మంది నివాసిస్తుంటారు. ధారావి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప‌బ్లిక్ టాయలెట్ల‌పైనే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఇక్క‌డ ఒక్కో టాయ‌లెట్‌ను సుమారు 80 మంది వాడుతున్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ఇళ్ల‌లో ప్ర‌త్యేకంగా మ‌రుగుదొడ్లు కూడా లేని ప‌రిస్థితి ఈ వాడ‌ది. నీటి కొర‌త కూడా తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో భౌతిక దూరం పాటించ‌డం, త‌ర‌చూ చేతులు క‌డుక్కోవ‌డం చాలా క‌ష్టం. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ క‌రోనా క‌నుక మూడో ద‌శ‌లోకి వెళితే ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందిప‌డాల్సిన ప‌రిస్థితులు ఉంటాయి.

వందేళ్ల క్రితం ప్లేగూ వ్యాధి వ్యాపించిన స‌మయంలోనూ ధారావిలో భారీగా ప్రాణ‌న‌ష్టం జ‌రిగిందని చ‌రిత్ర చెబుతోంది. ధారావి ప్ర‌జ‌లు చిన్న ప‌నులు చేసుకొని జీవ‌నం గ‌డుపుతారు. ఇప్ప‌టికే లాక్‌డౌన్ కార‌ణంగా వారికి ఉపాధి లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి వీరికి ప్ర‌భుత్వం, కొన్ని సంస్థ‌లు ఆహారాన్ని, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అందిస్తోంది.

చాలామంది ధారావి ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిర‌ప‌డిన వారే. వీరికి ఉపాధి క‌ష్ట‌మైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. చాలా మంది తిరిగి త‌మ‌ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, ధారావిలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను ఆదుకునే స‌వాళ్లు ఇప్పుడు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్నాయి.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle