అట్టుడుకుతున్న ఢిల్లీ.. వీసీపై జోషి కామెంట్లు
10-01-202010-01-2020 09:19:32 IST
Updated On 10-01-2020 10:06:38 ISTUpdated On 10-01-20202020-01-10T03:49:32.787Z10-01-2020 2020-01-10T03:48:21.944Z - 2020-01-10T04:36:38.602Z - 10-01-2020

దేశవ్యాప్తంగా జేఎన్ యూ దాడి ఘటన అలజడి రేపుతోంది. గురువారం జేఎన్ యూ విద్యార్ధులు తమ ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్రపతి భవన్ ముట్టడికి వారు ప్రయత్నించడంతో ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థంకాక ఢిల్లీ వాసులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అంబేద్కర్ భవన్ వద్ద అడ్డుకొన్నారు.

దీంతో మిగతా విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తారనే భావించి రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ర్యాలీలో యూనివర్శిటీలో మూకల దాడిలో గాయపడ్డ విద్యార్ధి సంఘం నేత ఆయిషీ ఘోష్ పాల్గొన్నారు. ఎడమచేతికి కట్టు, తలకు బ్యాండేజ్ తో వున్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. వీసీ వైదొలగాలన్న డిమాండ్ నెరవేరేదాకా నిరసన ఆపేది లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్ పేర్కొన్నారు.
విద్యార్థులతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వద్ద కూడా భద్రతను పెంచారు. పెంచిన భద్రతా సిబ్బంది రాత్రంతా గస్తీ తిరిగారు.
మరో వైపు జేఎన్‌యూ వీసీని సస్పెండ్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విద్యార్థులు రాష్ట్రపతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేయడంపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందించారు. విద్యార్థులతో సంఘీభావం తెలిపిన జోషి.. వీసీ జగదీశ్‌ను పదవీ నుంచి తొలగించాల్పిందే అని డిమాండ్ చేశారు.
జేఎన్‌యూలో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఫీజులకు సంబంధించి సరైన విధానాలను అవలంభించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జేఎన్‌యూ వీసీకి రెండుసార్లు సూచించిందని జోషి గుర్తుచేశారు.

హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సిఫారసులనే వీసీ పట్టించుకోలేదని, ఆయనను వెంటనే తొలగించాలన్నారు. ఇదిలా ఉండగా.. జేఎన్‌యూ వీసీ ఎం జగదీష్ కుమార్‌ను తొలగించే ప్రసక్తి లేదని హెచ్ఆర్డీ స్పష్టం చేసింది. జేఎన్‌యూ విద్యార్ధులు, వర్సిటీ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ కొరవడిన క్రమంలో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. శు2క్రవారం విద్యార్దులు, వర్శిటీ అధికారులతో కీలక భేటీ జరుగుతుందని ప్రకటించింది.హెచ్చార్డీ నిర్ణయించిన మేర ఫీజుల పెంపుపై వెనక్కితగ్గేది లేదని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు.


ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
16 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా