newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అజ్ఞాత విరాళాలమీదే బతికేస్తున్న రాజకీయపార్టీలు.. 15 ఏళ్లలో రూ.11 వేల కోట్లు

10-03-202010-03-2020 15:12:14 IST
Updated On 10-03-2020 16:32:50 ISTUpdated On 10-03-20202020-03-10T09:42:14.810Z10-03-2020 2020-03-10T09:42:10.868Z - 2020-03-10T11:02:50.893Z - 10-03-2020

అజ్ఞాత విరాళాలమీదే బతికేస్తున్న రాజకీయపార్టీలు.. 15 ఏళ్లలో రూ.11 వేల కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత పదిహేనేళ్ల కాలంలో దేశంలోని రాజకీయ పార్టీలు అజ్ఞాత మార్గాల ద్వారా రూ. 11,234 కోట్లను విరాళాలుగా అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆప్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా అజ్ఞాత విరాళాల స్వీకరణలో పోటీ పడుతున్నాయయని ఏడీఆర్ పేర్కొంది.

దేశంలోని జాతీయ పార్టీలు గత 15 ఏళ్ల కాలంలో అంటే  2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. 

రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్‌ ఫండ్‌, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.

2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్‌ పేర్కొంది.

తమకు అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి రూ.1612.04కోట్ల విరాళాలు వచ్చాయని  అధికార బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రూ.728.88 కోట్ల విరాళాల్లో 29 శాతం అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల విక్రయాల ద్వారా రూ.3,902.63 కోట్ల విరాళాలు వచ్చాయని ప్రకటించాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తమకు స్వచ్ఛందంగా ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీతో సహా అయిదు జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే (రూ. 900.94 కోట్లు) బీజేపీకి 1.5 రెట్ల అధికంగా అజ్ఞాత మార్గాల నుంచి విరాళాలు రావడం గమనార్హం

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle