newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం.. ఆదిత్యకు కేబినెట్ బెర్త్

30-12-201930-12-2019 16:29:46 IST
2019-12-30T10:59:46.309Z30-12-2019 2019-12-30T10:59:39.807Z - - 12-04-2021

అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం.. ఆదిత్యకు కేబినెట్ బెర్త్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో ఎట్టకేలకు పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటైంది. అంతా ఊహించినట్టుగానే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో గతంలో ఏర్పడిన ప్రభుత్వంలోనూ అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ శరద్ పవార్ చొరవతో డిప్యూటీ సీఎం పదవి వరించింది.

కేబినెట్‌లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సోమవారం వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం ఉద్దవ్ థాక్రే మంత్రివర్గంలో ఆదిత్యకు చోటు లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరి నిముషంలో సంకీర్ణ కూటమికి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి ఆదిత్యకు అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది. 

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తండ్రి ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి మంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా ఆదిత్య రికార్డుల కెక్కారు. దిలీప్ పాటిల్, విజయ్ వాడెత్తివార్, ధనుంజయ్ ముండే ప్రమాణం చేశారు.

ఎన్సీపీ నుంచి 10 మంది కేబినెట్, 4గురు సహాయమంత్రులు, కాంగ్రెస్ నుంచి 8 మందికి కేబినెట్, ఇద్దరికి సహాయమంత్రి పదవులు లభించాయి. శివసేన నుంచి ఆరుగురు మంత్రులు, ముగ్గురు సహాయమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేఎస్పీ పార్టీ నుంచి ఒకరు కేబినెట్, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి సహాయమంత్రిగా అవకాశం ఇచ్చారు. 

అలాగే, కాంగ్రెస్‌ నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. త్వరలోనే వీరికి శాఖలు కేటాయిస్తారు. అశోక్ చవాన్ గతంలో సీఎంగా పనిచేశారు. 2008 డిసెంబర్‌ 8 నుంచి 2010 నవంబర్‌ 9 వరకు ఆయన పదవిలో ఉన్నారు. అయితే ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయన పేరు స్పష్టంగా వినిపించడంతో పార్టీ ఆధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle