newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అజిత్‌కి జాక్ పాట్.. మళ్ళీ అదే పదవి?

30-12-201930-12-2019 08:53:09 IST
Updated On 30-12-2019 11:24:38 ISTUpdated On 30-12-20192019-12-30T03:23:09.699Z30-12-2019 2019-12-30T03:23:06.562Z - 2019-12-30T05:54:38.646Z - 30-12-2019

అజిత్‌కి జాక్ పాట్.. మళ్ళీ అదే పదవి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అజిత్ పవార్ దశ మళ్లీ తిరిగింది. తాను గతంలో కోరుకున్న పదవి మళ్లీ వరించబోతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి రేసులో వున్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్సీపీని వీడి బీజేపీతో జత కట్టిన అజిత్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలు శరద్ పవార్‌కి షాకిచ్చాయి. అనూహ్య పరిణామాల తర్వాత మళ్ళీ శరద్ పవార్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. 

అనంతరం ఉద్ధవ్ థాకరే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాది పేరుతో సర్కారు ఏర్పాటుచేశారు. సర్కార్లో అజిత్‌కు చోటివ్వలేదు. శరద్ పవార్ తర్వాత పార్టీలో ఆయనే  కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటినా ఇప్పటివరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. నవంబర్ 29న ఉద్ధవ్‌తో పాటు ఎన్సీపీ తరపున ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, శివసేన తరపున ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్ ప్రమాణం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ జరపలేదు.

మంత్రివర్గ విస్తరణ. పదవుల పంపకం విషయంలో కూటమిలో సెగలు రాజుకుంటున్నాయని వార్తలు వచ్చినా అవి పుకార్లేనని తేలింది. తాజాగా సోమవారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ఱయించారు. అందులో భాగంగా  కాంగ్రెస్ తరపున 12 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని వీరిలో పది మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులుండే అవకాశం ఉంది. అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన హోం శాఖ కూడా దక్కే అవకాశం ఉండడంతో అజిత్ పవార్‌ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. 

డిసెంబర్‌ 30న ఉద్ధవ్‌ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని జాతీయ వార్తాసంస్థ ఒకటి తెలిపింది. మంత్రివర్గంలోకి శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు.

శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్‌ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. అజిత్ పవార్‌కి మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి లభిస్తే ఆయన కంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. వడ్డించేవాళ్ళు మనవాళ్ళయితే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా మనకు దక్కాల్సింది దక్కుతుందంటే ఇదే మరి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle