newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్.. ఫ్రీగా పంపిణీ

23-08-202023-08-2020 12:20:21 IST
2020-08-23T06:50:21.958Z23-08-2020 2020-08-23T06:49:52.893Z - - 14-04-2021

అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్.. ఫ్రీగా పంపిణీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్ని కరోనా కేసులు పెరిగినా రికవరీ రేటులో వృద్ధి కనిపించడంతో అంతా ఊరట చెందుతున్నారు. అందరి ఆలోచన ఒకటే త్వరగా కరోనా వ్యాక్సిన్ రావాలని. తాజాగా ఓ శుభవార్త వెలువడింది. అక్టోబర్ నెల చివర్లోగా ‘కోవిషీల్డ్’ అన్న కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తుందని పూణేకు చెందిన ‘‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’’ ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. 

‘‘భారత ప్రభుత్వం ఈ విషయంలో మాకు లైసెన్స్ ఇచ్చింది. దీని కింద ట్రయల్స్ ప్రొటోకాల్‌ను మేము వేగవంతం చేశాము. ఈ ట్రయల్ మరో 58 రోజుల్లోనే పూర్తవుతుంది. మూడో దశ ట్రయల్ లో ఇవ్వాల్సిన మొదటి మొతాదును శనివారమే ఇచ్చామని, రెండో మోతాదును మాత్రం 29 రోజుల తర్వాత ప్రయోగిస్తామని పేర్కొన్నారు. రెండో మోతాదు ఇచ్చిన 15 రోజుల తర్వాత తుది నిర్ణయం తెలుస్తుంది. దీని తర్వాతే ‘‘కోవి షీల్డ్’ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని మేము సర్వ సన్నద్ధమవుతున్నాం.’’ అని ఆ సంస్థ ప్రతినిధులు ఓ మీడియా ఛానెల్ తో చెప్పారు.

సంస్థ ప్రతినిధులు శనివారం నుంచే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 17 కేంద్రాల్లో ట్రయల్స్‌ను ముమ్మరం చేసేశారు. ప్రతి కేంద్రంలో సుమారు వంద మందిపై ఈ ట్రయల్స్‌ను చేయనున్నట్టు తెలిపారు.

ఆఆస్ట్రా జెనెకా’ సంస్థ నుంచి వీరు తయారీ హక్కులను కొనుగోలు చేశారు. సీరం ఇనిస్టిట్యూట్ నుంచి నేరుగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తామని కేంద్ర  ప్రభుత్వం సంకేతాలిచ్చింది. వారినుంచి కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగానే ఇస్తామని కూడా పేర్కొంది. జూన్ 2022 నాటికి ఈ సంస్థ నుంచి ప్రభుత్వం 68 కోట్ల వ్యాక్సిన్లను కొనుగోలు చేయనుంది. ముందుగా కరోనా వ్యాక్సిన్ ఎవరికి పంపిణీ చేయాలనేది త్వరలో ప్రకటించనుంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle