newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్కడ ఇక నో వేలంటైన్స్ డే.. గుజరాత్ నయా జీవో

10-02-202010-02-2020 08:08:07 IST
Updated On 10-02-2020 15:49:54 ISTUpdated On 10-02-20202020-02-10T02:38:07.733Z10-02-2020 2020-02-10T02:33:06.034Z - 2020-02-10T10:19:54.162Z - 10-02-2020

అక్కడ ఇక నో వేలంటైన్స్ డే.. గుజరాత్ నయా జీవో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫిబ్రవరి 14. ప్రేమికులకు పండుగ రోజు. వేలంటైన్స్ డేనాడు ప్రేమికులు పార్కుల చుట్టూ తిరుగుతారు. రంగు రంగుల డిజైన్ గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్ లతో ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ విదేశీ సంస్కృతిపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రం సరికొత్త సంప్రదాయానికి తెరతీస్తోంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో స్పెషల్ జీవో ఒకటి విడుదలైంది. 

ఈ జీవోపైనే చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. బహిష్కరణ అంటే యూత్ నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన గుజరాత్ ప్రభుత్వం ఆపేరు చెప్పకుండా.. చిన్నతనం నుంచే పిల్లలకు పాశ్చాత్య సంస్కృతివైపు అడుగులు వేయకుండా.. ఆరోజున తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సూరత్ జిల్లాలోని స్కూళ్లలో ప్రేమికుల రోజున తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాలలన్నింటికి ఆదేశాలు కూడా జారీ చేశారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖాధికారి చెబుతున్నారు. ఫిబ్రవరి 14న విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకువచ్చి, వారికి పూజలు నిర్వహించి, స్వీట్లు పంచిపెట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాగా విద్యాశాఖ జారీ చేసిన ఈ ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓ నాటకమని.. కొత్త వివాదాలను తెరమీదకు తెచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడుతున్నారు. కేవలం తమ సిద్ధాంతాలను రుద్దడానికే బీజేపీ నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆగ్రహంతో వున్నాయి. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle