newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అందరి జీవితకాల స్వప్నం సాకారం.. ప్రధాని మోడీ భావోద్వేగం

05-08-202005-08-2020 14:15:34 IST
Updated On 05-08-2020 14:49:46 ISTUpdated On 05-08-20202020-08-05T08:45:34.222Z05-08-2020 2020-08-05T08:44:35.390Z - 2020-08-05T09:19:46.984Z - 05-08-2020

అందరి జీవితకాల స్వప్నం సాకారం.. ప్రధాని మోడీ భావోద్వేగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయింది. శతాబ్ధాల నిరీక్షణ ఇవాళ్టితో పూర్తయింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛారణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. భూమి పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా వున్న రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి.

https://www.photojoiner.net/image/RmBxA0Bn

దేశంలోని వివిధ పవిత్ర నదీ జలాలతో ఈ క్రతువు నిర్వహించారు. దేశం యావత్తు ఆ అపురూప ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించింది. అయోధ్యలో శ్రీరామజన్మభూమి ప్రాంగణంలో దివ్యమందిర భూమి పూజ తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితకాలంలో ఈ కల సాకారమవుతుందని కోట్లమంది నమ్మలేకపోయారన్నారు. దేశం మొత్తం ఇవాళ రామమయమైంది, భూమి పూజకు తనను ఆహ్వానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 

అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. జైశ్రీరామ్‌ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.రామమందిరం భూమి పూజలో పాల్గొనడం తమ అదృష్టమని, ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి అన్నారు. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుందని, అది మన అదృష్టం అని పేర్కొన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్ శ్లాఘించారు. విశ్వమానవాళికి మార్గదర్శనం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రాబోతుందన్నారు. రామమందిరంలో త్వరగా పూజలు చేయాలని అందరికీ ఉందన్నారు. 

భూమి పూజకు ముందు మోడీ ముందుగా హనుమాన్‌ గడీని సందర్శించారు. హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకంగా హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కరే ఉన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వీరిద్దరూ ఆలయంలో కలియ తిరిగారు. రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  రామానంద్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్యకు వచ్చిన ప్రధానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఘనస్వాగతం పలికారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle