newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

అందరి చూపు.. కర్నాటక వైపే!

22-07-201922-07-2019 08:03:56 IST
Updated On 22-07-2019 12:09:14 ISTUpdated On 22-07-20192019-07-22T02:33:56.904Z22-07-2019 2019-07-22T02:33:49.515Z - 2019-07-22T06:39:14.227Z - 22-07-2019

అందరి చూపు.. కర్నాటక వైపే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల మనుగడ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు చందంగా మారింది. ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. కర్నాటకలో మాత్రం క్షణక్షణానికీ సీన్ మారుతోంది. వారం నుంచి ఇదే పంథా కొనసాగుతోంది.

సుప్రీంకోర్టు, గవర్నర్, స్పీకర్... చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలను నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశాయి. 

విధాన సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు తెలిపాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతానన్నారు సీఎం కుమారస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తానన్నారు. ఇక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వచ్చిన ఊహాగానాలపై స్పందించిన కుమారస్వామి.. తన హెల్త్ బాగుందని తెలిపారు. ఇదిలా ఉంటే..  ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డి.కె.శివకుమార్‌ తెలిపారు.

సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్‌ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు ముంబైలోని రినైసెన్స్‌ హోటల్‌లో ఉంటున్న రెబెల్‌ ఎమ్మెల్యేలు శివకుమార్‌ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు.

ఇష్టపూర్వకంగానే  ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాక బెంగళూరు వెళతాం’ అంటూ వీడియో విడుదల చేయడం విశేషం. 

బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి కాసేపు షాకిచ్చారు.  సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్‌ తెలపడంతో కుమారస్వామి కలవరపడ్డారు. కాసేపటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించి, కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. 

స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం సుప్రీం తలుపు తడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.

ఈ పిటిషన్ పై సోమవారమే సుప్రీంకోర్టు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని కీలక పరిణామాల నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ స్పీకర్ ఏంచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle