newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అందరికీ న్యాయం ఈ ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రపతి ప్రసంగం

31-01-202031-01-2020 12:33:36 IST
Updated On 31-01-2020 12:49:01 ISTUpdated On 31-01-20202020-01-31T07:03:36.029Z31-01-2020 2020-01-31T07:03:31.598Z - 2020-01-31T07:19:01.009Z - 31-01-2020

అందరికీ న్యాయం ఈ ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రపతి ప్రసంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. కేంద్రప్రభుత్వ విజయాలను, లక్ష్యాలను వివరించారు. నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని.. ఈ దశాబ్దం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు.

గత సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిందని.. అంతా కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను రాష్ట్రపతి వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ఇంగ్లీషు అనువాదం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 

ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చామని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కొత్త బిల్లులను కూడా తీసుకొచ్చామన్నారు. ట్రాన్స్‌ జెండర్‌ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. కిసాన్ సన్మాన్ నిధితో 8 కోట్ల మంది రైతులు లబ్ధిపొందారు.. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా బీమా అమలు చేస్తున్నామన్నారు రాష్ట్రపతి.

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు రాష్ట్రపతి.. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ఐక్యతగా వ్యవహరించడం హర్షణీయమని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయం వల్ల జమ్మూ, కశ్మీర్‌, లఢక్‌ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని, దేశంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు కశ్మీర్‌కు కూడా వర్తిస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు.సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతోందని, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు భారీగా కేటాయించారని, అక్కడ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే బోడో సమస్యను పరిస్కరించారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించారని రాష్ట్రపతి వివరించారు.

గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, బ్యాంకింగ్‌ రంగంలో భారత్‌ గణనీయమైన అభివృద్ది సాధించిందని పేర్నొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై మాట్లాడుతూ.. గాంధీ స్పూర్తితో పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని, ఇది మన కర్తవ్యమని తెలిపారు.

సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కోవింద్‌ వెల్లడించారు. పాలనా విభాగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రభుత్వ సేవలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని కోవింద్‌ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చించారని తెలిపారు. పాకిస్థాన్ లో మైనార్టీలను టార్గెట్ చేసింది.. నన్‌కానా షాహిబ్‌ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle