newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అందంగా కనబడుతూ, ఇంగ్లీషు చక్కగా మాట్లాడితే చాలా.. పైలట్‌పై గహ్లాత్ చురకలు

16-07-202016-07-2020 07:32:05 IST
2020-07-16T02:02:05.619Z16-07-2020 2020-07-16T02:02:02.141Z - - 22-04-2021

అందంగా కనబడుతూ, ఇంగ్లీషు చక్కగా మాట్లాడితే చాలా.. పైలట్‌పై గహ్లాత్ చురకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా బీజేపీ కంబంధ హస్తాలనుంచి తృటిలో బయటపడి ముఖ్యమంత్రి పదవినీ, ప్రభుత్వాన్ని కాపాడుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ పనిలోపనిగా తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ని ఏకి పడేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కుటుంబంలోంచి వచ్చిన సచిన్ పైలట్ ప్రతిపక్ష బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో భాగస్వామి అయ్యారని గహ్లాత్ ఆరోపించారు.

ఇంగ్లీష్‌ బాగా మాట్లాడటం, మీడియా ముందు మంచిగా అభిప్రాయాలు వెల్లడించడం, పైగా అందంగా ఉండటం ఒక్కటే రాజకీయ నేతలకు సరిపోదని సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి గహ్లాత్ వ్యాఖ్యానించారు. అధికారం కోసం వ్యామోహం కంటే దేశం కోసం మీ హృదయంలో ఏముందన్నదే ముఖ్యమని,  సిద్ధాంతం..విధానాలు..అంకితభావం అనేవి ఎవరికైనా  కీలకమని ఆయన హితవు పలికారు. 

ఈ సందర్భంగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ,, నూతన తరాన్ని తాము తప్పకుండా స్వాగతిస్తామని, ఎందుకంటే భవిష్యత్‌ వారిదేనని గహ్లోత్‌ చెప్పారు. నేటి తరం నేతలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ చీఫ్‌లుగా సునాయాసంగా ఎదిగి వచ్చారని, కానీ వారి వయసులో తాము ఒక్కో మెట్టు ఎక్కివచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని రాజస్థాన్ సీఎం హితవు పలికారు.

కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించబడిన సచిన్‌ పైలట్‌ సహా 18 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్‌ స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిన మీదట స్పీకర్‌ ఈ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోగా వారు నోటీసులపై బదులివ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రెబెల్‌ నేత పైలట్‌పై ముఖ్యమంత్రి గహ్లోత్‌ తీవ్రస్ధాయిలో విమర్శలకు దిగారు. 

అయితే 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారంటూ తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్‌ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో మరో అంకానికి తెర లేచింది. ప్రభుత్వంలో ఉంటున్న అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధమైంది. 

సీఎం అశోక్‌ గహ్లోత్‌‌ వర్గం ఫిర్యాదుతో అసమ్మతి వర్గానికి శాసన సభ స్పీకర్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలను ఆదేశించారు. జైపూర్‌లో మంగళవారం జరిగిన రెండో దఫా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీ అధిష్టానం వేటువేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వానికి గండం తప్పిన నేపథ్యంలో బహిష్కరణకు గురైన సచిన్ పైలట్ తదితర నేతలను మళ్లీ కాంగ్రెస్‌లో కలుపుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవకాశం దొరికితే అధికారం కైవసం చేసుకోవడానిక బీజేపీ సిద్ధంగా ఉంటున్న నేపథ్యంలో తెగేదాగా లాగడం ప్రమాదకరం అని భావించిన కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle