newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

06-07-202006-07-2020 08:16:56 IST
Updated On 06-07-2020 09:48:05 ISTUpdated On 06-07-20202020-07-06T02:46:56.266Z06-07-2020 2020-07-06T02:46:47.184Z - 2020-07-06T04:18:05.685Z - 06-07-2020

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కేసులు తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. అసోంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 11వేలకు చేరాయి. అసోంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కరోజు 1202 కేసులు నమోదయ్యాయి. గువహటిలోనే 777 కేసులు వచ్చాయి. 14మంది మరణించారు. 6743 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా ఏ చిన్న అవకాశాన్నీ వదడలం లేదు. కానీ జనం మాత్రం పుట్టినరోజులు, అంత్యక్రియలు, పార్టీ కార్యక్రమాలంటూ తిరుగుతున్నారు. కార్పెట్ వేసి మరీ కరోనాను ఆహ్వానిస్తున్నారు. తాజాగా అసోంలో అదే జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలో ఓమత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరయ్యారు.

అంత్యక్రియలకు 50 మందికంటే ఎక్కువగా ఎవరూ వెళ్లకూడదని కోవిడ్ 19 నిబంధనలు వున్నా వాటిని పక్కన పెట్టేశారు జనం. దీంతో  అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది. అంత్యక్రియలు జరిగిన గ్రామానికి సమీపంలో శానిటైజ్ చేసింది. అంతేకాదు, ఆ ఊరినుంచి మూడు గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆల్‌ ఇండియా జమాయిత్‌ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్‌–ఇ–షరియత్‌ అయిన ఖైరుల్‌ ఇస్లాం ఇటీవల మరణించారు. 

ఆయన అంత్యక్రియలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. ఖైరుల్‌ ఇస్లాం కుమారుడు, ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీకి చెందిన అమినుల్‌ ఇస్లాం నగౌన్‌ జిల్లా ధింగ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. తన తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ముస్లిం నేతలు భారీగా తరలివచ్చారు.

లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా అంత్యక్రియలకు 10 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ పరిసరాల్లో ఉన్న 3 గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇంతమంది అంత్యక్రియలకు రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వీరిలో ఎంతమందికి కరోనా వుందో.. మరెన్ని వందలమందికి కరోనా వ్యాపిస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   25 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle