newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘‘NRCపై జగన్ రెండునాల్కల ధోరణి’’

24-12-201924-12-2019 17:33:53 IST
2019-12-24T12:03:53.530Z24-12-2019 2019-12-24T12:03:51.158Z - - 05-08-2020

‘‘NRCపై జగన్ రెండునాల్కల ధోరణి’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వబోదని.. తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని జగన్ పేర్కొనడంపై టీడీపీ మండిపడింది. జాతీయ పౌరసత్వ కేంద్రం తీసుకునే వివిధ బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చేసరికి రెండునాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎన్‌ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని.. మైనార్టీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొనడం. డిప్యూటీ సీఎం మాటలకు వత్తాసు పలకడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. నిజంగా ఎన్నార్సీని వ్యతిరేకించినట్టయితే.. రాష్ట్రంలో ఎన్నార్సీ అమలుకు ఎందుకు పూనుకుంటున్నారని, జీవో ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం 16 ఆగస్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ ని ఎందుకు విడుదల చేసిందో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఓటు కోసం ఎంత పెద్ద అబద్ధాన్నైనా చెప్పేస్తారా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ముస్లింలకు ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేయడం, ఇటీవల కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వైసీపీ మద్దతుగా ఓటేసిన సంగతిని టీడీపీ నేత వర్ల రామయ్య గుర్తుచేశారు. 

మాట తప్పను.. మడమ తిప్పను అనే జగన్.. ఎందుకు ప్రతి విషయంలో మాట తప్పుతున్నారో, మడమ తిప్పుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అగమ్యగోచరంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా... పార్లమెంటులో సీఏబీని సమర్ధించారన్నారు. ప్రభుత్వం ఎన్నార్సీకి అనుకూలంగా జీవో ఎలా విడుదల చేశారన్నారు. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతున్నారన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.

22 మంది ఎంపీలు ఇస్తే ఏం చేస్తున్నారన్నారు. పంచాయితీ ఆఫీసులకు రంగులు వేస్తూ నాటకాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మహిళలకు రక్షణ లేదని, ఓ మైనర్ బాలికపై వైసీపీ నేత అఘాయిత్యం చేస్తే జగన్ పట్టించుకోలేదని నెల్లూరు మాజీ మేయర్ అజీజ్ విమర్శించారు. జగన్ ని చూసి ముస్లింలు ఓటు వేయలేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వున్న అభిమానంతో ఓట్లేసి గెలిపించారన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle