newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

9వ రోజుకి చేరిన నిరసనలు.. తుళ్ళూరులో ఇవాళ భారీ ధర్నా

26-12-201926-12-2019 09:39:40 IST
Updated On 26-12-2019 10:19:24 ISTUpdated On 26-12-20192019-12-26T04:09:40.382Z26-12-2019 2019-12-26T04:09:30.688Z - 2019-12-26T04:49:24.624Z - 26-12-2019

9వ రోజుకి చేరిన నిరసనలు.. తుళ్ళూరులో ఇవాళ భారీ ధర్నా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతికి అన్యాయం చేయవద్దు... మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ ఏపీ రాజధాపి అమరావతి రైతులు గత 8 రోజులుగా దీక్షలు, ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే.  ఇవాళ నిరసనలు 9వ రోజుకి చేరాయి. అయినా రైతులు, మహిళలు వెనక్కి తగ్గడం లేదు. తుళ్ళూరులో ధర్నా దీక్షకి  పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు రైతులు. రేపు క్యాబినెట్ భేటి దృష్ట్యా రాజధాని రైతుల కార్యాచరణ పై చర్చించనున్నారు. ఈ ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలు,ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు,డాక్టర్ల సంఘాలు,అమరావతి పరిరక్షణ సమితి,గుంటూరు జిల్లా ప్రజానీకం.

దీంతో ఎన్నడూ లేని విధంగా అమరావతి అట్టుడికిపోతోంది. ఈ రోజు తుళ్ళూరులో ధర్నా దీక్షలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఇది ఏ కులానికి సంబంధించిన ఉద్యమం కాదని మహిళలు గొంతెత్తి అరుస్తున్నారు. కులాలు,మతాలకు అతీతంగా తుళ్ళూరులో సర్వమతా ప్రార్థనలు జరుగుతున్నాయి. 

మందడం, తుళ్ళూరుల్లో పర్యటించనున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం లోకేష్ అమరావతికి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

వెలగపూడి, కృష్ణాయపాలెంలో 9వరోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి, రైతులు మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలసి రాజధాని గా అమరావతి కొనసాగేందుకు చొరవ చూపాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle