newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం.. ఇక కరువు లేదని మంత్రి భరోసా

24-09-201924-09-2019 09:05:28 IST
Updated On 24-09-2019 11:56:52 ISTUpdated On 24-09-20192019-09-24T03:35:28.926Z24-09-2019 2019-09-24T03:35:26.511Z - 2019-09-24T06:26:52.820Z - 24-09-2019

41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం.. ఇక కరువు లేదని మంత్రి భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక కరువు తీరా ఇసుకను సరఫరా చేయనున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇసుక టెండరింగ్‌లో నూతన విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత 13 జిల్లాల పరిధిలోని  ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక అమ్మకాలు ఇప్పటికే మొదలెట్టామని, భారీగా ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.

గత మూడు నెలలుగా ఇసుక అమ్మకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా ఆపివేయడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, తదితర సిబ్బంది, గృహ యజమానులు ఇసుక దొరక్క అల్లాడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి ప్రకటన వీరందరికీ ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. 

ఈ నెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి  తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్‌లను, 51 స్టాక్ యార్డ్‌లను సిద్ధం చేశామని చెప్పారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సప్లై కోసం టెండర్లు కూడా పిలవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.

గోదావరి, కృష్ణానదిలో వరద కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారింది తప్ప ఇసుకను అందుబాటులో ఉంచకుండా చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి వివరించారు. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 20 వేయింగ్ మిషన్ లను ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరా కొరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కృష్ణా, గోదావరి నదుల్లో వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే అవసరానికి తగినంత ఇసుక నిల్వలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 12 రీచ్ ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను, రోజుకు పది వేల క్యూబిక్ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కొత్త రీచ్ లను గుర్తించడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తీసుకు వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని వివరించారు.

ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్లు సరఫరా చేశామని, వరదలు తగ్గగానే ఎపీఎండీసీ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పట్టాదారు భూముల నుంచి కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పడవల ద్వారా ఇసుక రవాణా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు.

ఏది ఏమైనా మూడునెలలుగా ఇసుక అందుబాటులో లేక హతాశులైన ప్రజలకు మంత్రి ప్రకటనతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. నిర్మాణపనులు రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకోగలవని భావిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle