newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

40 ఇయర్స్ పాలిటిక్స్.. బాబు నోట అలాంటి మాటలా?

08-07-201908-07-2019 07:07:41 IST
Updated On 08-07-2019 10:34:40 ISTUpdated On 08-07-20192019-07-08T01:37:41.343Z08-07-2019 2019-07-08T01:37:20.255Z - 2019-07-08T05:04:40.003Z - 08-07-2019

40 ఇయర్స్ పాలిటిక్స్.. బాబు నోట అలాంటి మాటలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మైండ్ సెట్ బాగా మారిపోయింది. ప్రతి చిన్న విషయంపై ఆయన చాలా ఆందోళనగా స్పందిస్తున్నారు. పార్టీ భవిష్యత్తుపై చంద్రబాబుకి బెంగ ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు, తన భద్రత విషయంలో ఆయన లేనిపోని అనుమానాలకు లోనవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో తనకు లభించిన సెక్యూరిటీ ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఒక రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు నోటినుంచి ఇలాంటి మాటలు రావడం విస్మయం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబునాయుడికి గతంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గరు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. ప్రస్తుతం అందరినీ తొలగించి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. దీనిపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. భద్రత కుదింపు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని విమర్శిస్తున్నాయి.

అయితే హోదాను బట్టి భద్రత ఉంటుంది. చంద్రబాబు భద్రత గురించి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఏ హోదా వారికి ఎలాంటి భద్రత ఉంటుందో ప్రభుత్వం కోర్టుకి తెలియచేసింది. చంద్రబాబు విజయవాడలో ఎక్కువగా ఉంటున్నారు.

ఆయనకు అక్కడ భద్రత అవసరమే. కానీ, ఆయన హైదరాబాద్ నివాసానికి కూడా భద్రత కల్పిస్తున్నారు. అయితే స్వగ్రామంలోని నివాసానికి కూడా పూర్తిస్థాయి భద్రత కోరడం గమనించాల్సిన అంశం. అక్కడ ఏడాదికి ఒకసారి మాత్రమే ఆయన అక్కడికి కుటుంబ సమేతంగా వెళతారు. అప్పుడు భద్రత అవసరం. 

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయంటున్నారు.  ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో  ఆరు చోట్ల టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైతే సీఎం  జగన్ మౌనంగా ఉన్నారని ఆయన చెప్పారు. హత్యా రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన చెప్పారు.

చంద్రబాబు నాయుడి భద్రత తగ్గింపుపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు భద్రత తగ్గించారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. నిజానికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అనవసరపు ఆరోపణలు సరికాదంటున్నారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టం చూసుకుంటుంది. అంతేతప్ప, భద్రతలోపం గురించి మరింతగా ఆందోళన చెందడం అసమంజసం అంటున్నాయి రాజకీయవర్గాలు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle