newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

30 రోజుల‌లోనే త‌న మార్క్ చూపించిన జ‌గ‌న్..!

30-06-201930-06-2019 13:01:34 IST
Updated On 03-07-2019 12:57:52 ISTUpdated On 03-07-20192019-06-30T07:31:34.564Z30-06-2019 2019-06-30T07:31:28.170Z - 2019-07-03T07:27:52.375Z - 03-07-2019

30 రోజుల‌లోనే త‌న మార్క్ చూపించిన జ‌గ‌న్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దేళ్ల క‌ష్టం ఫ‌లించి నేటి స‌రిగ్గా నెల‌. న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా నెల రోజుల క్రితం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. వ‌రుస‌గా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. మంత్రివ‌ర్గ ఏర్పాటు మొద‌లు జ‌గ‌న్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు.

గ‌త నెల 30వ తేదీన ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్ వ‌రుస‌గా అన్ని శాఖ‌ల‌పై స‌మీక్షలు జ‌రిపారు. అన్ని శాఖ‌ల ప‌రిస్థితిపై అవ‌గాహ‌న పెంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో, పాద‌యాత్ర స‌మ‌యంలో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రులు, అధికారుల‌కు సైతం మేనిఫెస్టో అమ‌లు ఎంత కీల‌క‌మో ప‌దేప‌దే చెబుతున్నారు. ప్ర‌తీరోజూ మేనిఫెస్టో క‌నిపించేలా త‌న ఛాంబ‌ర్‌తో పాటు మంత్రుల ఛాంబ‌ర్ల‌లో గోడ‌లపై అంటించారు.

ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో చెప్పిన‌ట్లుగా మొద‌టి సంత‌క‌మే పింఛ‌న్ల‌ను పెంచుతూ చేసిన జ‌గన్ త‌ర్వాత కూడా దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆశా వ‌ర్క‌ర్లు, పారిశుధ్య కార్మికుల‌కు జీతాలు భారీగా పెంచారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీంను ర‌ద్దు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఉద్యోగుల‌కు 27 శాతం ఐఆర్ ప్ర‌క‌టించారు.

ఇక‌, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే నాటికి ఆర్టీసీ కార్మికులు ప్ర‌భుత్వం ప‌ట్ల అసంతృప్తితో స‌మ్మె చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. జ‌గ‌న్ ఎదుర్కోబోయే మొద‌టి స‌వాల్ ఆర్టీసీనే అని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ మాత్రం ఒకే ఒక‌సారి ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు.

ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని ఉన్న డిమాండ్‌కు జ‌గ‌న్ వెంట‌నే ఓకే చెప్పారు. ఇందుకోసం క‌మిటీ వేశారు. ఇక‌నుంచి మీరంతా ప్ర‌భుత్వ ఉద్యోగులేన‌ని ఆర్టీసీ ఉద్యోగుల్లో భరోసా నింపారు. పోలీసుల‌కు క‌ల‌లా మిగిలిపోయిన వారాంత‌పు సెల‌వును జ‌గ‌న్ ఒకేసారి అమ‌లు చేసి పోలీసు కుటుంబాల్లో సంతోషం నింపారు.

రెండురోజుల పాటూ ప్ర‌జావేదిక‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌తో జ‌గ‌న్ సుదీర్ఘ స‌మావేశాలు నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్యాలేంటో, పాల‌న ఎలా ఉండాలో వారికి వివ‌రించారు.

అవినీతిని నిర్మూలించాల‌నే ప‌దేప‌దే చెప్పారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జావేదిక కూల్చివేత వంటి అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పాటు గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని భావిస్తున్న జ‌గ‌న్ అవినీతిని వెలికితీసేందుకు క్యాబినెట్ స‌బ్‌క‌మిటీ వేశారు.

క్యాబినెట్ కూర్పులో సామాజిక స‌మ‌తూల్య‌త పాటించి ఐదుగురికి ఉప ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం ఇచ్చి సంచ‌ల‌నానికి తెర‌లేపారు. మంత్రివ‌ర్గంలో త‌న సామాజ‌క‌వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టి బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల వారికి ప్రాధాన్య‌త ఇచ్చారు. పాల‌న‌లోనూ సాచ్యురేష‌న్ ప‌ద్ధ‌తిలో కులాలు, మ‌తాలు, ప్రాంతం, పార్టీ అనే బేధం చూడ‌కుండా అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందించాల‌ని ఆదేశించారు.

ఇక‌, తెలంగాణ‌, కేంద్రంతో జ‌గ‌న్ సత్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్ర‌త్యేక హోదా సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

తెలంగాణ‌తో క‌లిసి రెండు రాష్ట్రాల క‌రువు స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇలా జ‌గ‌న్‌, నెల రోజుల్లోనే ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌న మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో నెల రోజుల‌కే ప్ర‌తిప‌క్షం నుంచి జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా ప్ర‌జావేదిక కూల్చివేత‌, శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల్లో జ‌గ‌న్‌పై టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle