newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

30 మంది సిట్టింగ్‌లకు బాబు ఫిట్టింగ్

13-03-201913-03-2019 07:20:23 IST
Updated On 13-03-2019 19:22:22 ISTUpdated On 13-03-20192019-03-13T01:50:23.873Z13-03-2019 2019-03-13T01:35:59.019Z - 2019-03-13T13:52:22.848Z - 13-03-2019

30 మంది సిట్టింగ్‌లకు బాబు ఫిట్టింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీలో 30 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు టిక్కెట్ల కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో 16 మంది ఫిరాయింపుదారులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో 23 మంది టీడీపీలోకి జంప్ కొట్టారు. 2019 ఎన్నికల్లో కూడా టిక్కెట్ ఇస్తామని అప్పట్లో చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వీరిలో 16 మందికి టిక్కెట్లు ఇవ్వడం లేదు. సర్వేలు, మైనస్ మార్కుల పేరుతో టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరట. దీంతో వీళ్లంతా అమరావతిలోని చంద్రబాబు ఆఫీసు ముందు పడిగాపులు కాస్తున్నారు. కొంత మంది ఏకంగా నిరసనకు దిగుతున్నారు.

ఇదంతా ఫిరాయింపుదారుల పరిస్థితి అయితే... సొంత పార్టీకి చెందిన వారిలో కూడా 14 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు టిక్కెట్ల కోత ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ఆ 14 మంది నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తల నుంచి చంద్రబాబు రిపోర్ట్ తెప్పించుకున్నారట. వారి చేష్టలతో పార్టీ పరువు పోయిందనీ, అవినీతి పెరిగి జనంలో వ్యతిరేకత ఉందన్న నివేదికలతో, ఆ 14 మందికీ ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరట.

ముఖ్యంగా కొవ్వూరు ఎంఎల్ఏ జవహర్, పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనిత, విజయనగరం అర్బన్ ఎంఎల్ఏ మీసాల గీత, పార్వతీపురం ఎంఎల్ఏ బొబ్బిలి చిరంజీవులు, అమలాపురం ఎంఎల్ఏ అయినాబత్తుల ఆనందరావు, నిడదవోలు ఎంఎల్ఏ బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం ఎంఎల్ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు, చింతలపూడి ఎంఎల్ఏ పీతల సుజాత,  తాడికొండ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్, పోలవరం ఎంఎల్ఏ మొడియం శ్రీనివాసరావులకు ఈ ఎన్నికల్లో టిక్కెట్లు రావడం కష్టమని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత చెబుతున్నారట. దీనిపై తన పేరు చెప్పేందుకు మాత్రం ఆయన ఇష్టపడటం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle