newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

3 రాజధానుల బిల్లుకి శాసనమండలి గండం!

21-01-202021-01-2020 12:36:25 IST
2020-01-21T07:06:25.141Z21-01-2020 2020-01-21T07:06:22.771Z - - 24-02-2020

3 రాజధానుల బిల్లుకి శాసనమండలి గండం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నా.. రాజధాని అమరావతిలో రైతులు నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నా.. విశాఖలో రాజధాని మాకు వెయ్యి కిమీ అవుతుంది మొర్రో అని సీమ వాసులు మొత్తుకుంటున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అనుకున్న కుందేలుకి మూడేకాళ్లు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో నిరసన తెలిపితే రైతుల వీపుపై విరిగిన లాఠీలు.. అండగా వెళ్లిన నేతలపై కేసులు.. ఆడపడుచులు అని కూడా చూడకుండా దౌర్జ్యన్యాలు ప్రపంచం అన్నీ చూసేసింది. తన మనసులో మాటను కమిటీల పేరుతో బయటపెట్టించిన జగన్ చివరికి బిల్లుల రూపంలో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. సోమవారం బిల్లుపై చర్చతో పాటే బిల్లును కూడా పెట్టేశారు. ఎలాగూ సంఖ్యా బలం ఉంది కనుక టీడీపీ నేతలను సస్పెండ్ చేసి ఆమోదించుకున్నారు.

అయితే బిల్లు శాసన మండలిలో కూడా ఆమోదం పొందితేనే చట్టం అవుతుంది. కానీ మండలిలో వైసీపీకి పెద్దగా బలం లేకపోగా అసెంబ్లీలో మాదిరే ఆ బిల్లుకు టీడీపీ సభ్యులు అడ్డుపడే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి ఉన్నా అందుకు మూడు మూడు రాజధానుల ప్రతిపాదన సమంజసం కాదని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే మండలిలో బిల్లు ఆమోదం పొందకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మండలిలో మొత్తం 58 మంది సభ్యలు ఉండగా అందులో టీడీపీకి 34మంది సభ్యులు, అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. ఈక్రమంలో మండలి బిల్లు ప్రవేశపెడితే టీడీపీ నేతలు వ్యతిరేకిస్తే వీగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ సభ్యులకు దిశానిర్ధేశం చేయగా ఇక మిగిలిన సభ్యులంతా వైసీపీకి మద్దతునిచ్చినా బిల్లు ఆమోదం పొందడం కష్టమే.

అదే జరిగితే బిల్లు మండలిలో తిరస్కరణకు గురవడం ఖాయం. అయితే ఇందుకోసం జగన్ సర్కార్ మరికొన్ని ఉపాయలతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆర్డినెన్స్ ద్వారా వెళ్తే ఆరు నెలల్లోగా దానికి గవర్నర్ ఆమోదం తెలిపి కేంద్రం పరిశీలనకు పంపి అక్కడ ఆమోదం పొందాలి.

మరోవైపు మండలి ఆమోదం లేకుండా ఆర్డినెన్స్ ద్వారా వెళ్తే కోర్టులో పిటిషన్లు కూడా పోగయ్యే ప్రమాదం ఉంది. పైగా ఆర్డినెన్స్ ద్వారా వెళ్తే ఎప్పటికి తేలుతుందో కూడా స్పష్టత ఉండదు. ఈక్రమంలోనే జగన్ మూడు రాజధానుల బిల్లుకి మండలి రూపంలో గండం ఎదురవుతుంది. మరి ఈ గండాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొననున్నారు? బిల్లు ద్వారా తరలింపులో సక్సెస్ అవుతారా అన్నది చూడాల్సిఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle