newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

26వ రోజూ ఆందోళనలు.. పోలీసుల తీరుపై రైతుల ఆగ్రహం

12-01-202012-01-2020 09:28:11 IST
2020-01-12T03:58:11.304Z12-01-2020 2020-01-12T03:58:05.668Z - - 22-01-2020

26వ రోజూ ఆందోళనలు.. పోలీసుల తీరుపై రైతుల ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు రాజధానుల నిర్ఱయంపై అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. రాజధాని రైతుల ఆందోళన 26వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడంలో రైతుల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

మందడంలో శ్రీలక్ష్మి అనే 25 ఏళ్ల మహిళ అస్వస్థతకు గురైంది. శనివారం జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నారు. అయితే, పోలీసుల దాడిలో గాయపడ్డ శ్రీలక్ష్మిని 108లో విజయవాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు మందడం గ్రామస్తులు.

పోలీసులు కడుపులో కొట్టారంటూ తుళ్లూరులో మహిళలు  రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రైతులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతులు వేసుకున్న టెంట్లను తొలగించడంతో పోలీసుల తీరుపై నిరసన తెలిపారు గ్రామస్తులు. నిరసనలకు ఎలాంటి అనుమతి లేదన్నారు పోలీసులు.  అయితే తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తుళ్లూరు రైతులు మండిపడుతున్నారు. 

ఇదిలా వుంటే..ఆదివారం అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్దారణ కమిటీ రానుంది. దుర్గ గుడికి వెళ్తున్న తమపై.. పోలీసులు అనుసరించిన తీరును మహిళా రైతులు కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

పోలీసుల తీరుకి సంబంధించి వీడియోలు, ఫోటోలను కమిషన్‌కు అందచేయనున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేయనున్నారు. మందడంలో మహిళల మీద దాడి ఘటనపై కూడా మహిళా రైతులు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు రాజధాని నిర్ణయంపై 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం జరగనుంది. దీంతో సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle