newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

2430 జీఓపై ఏపీలో వెల్లువెత్తుతున్న నిరసనలు

02-11-201902-11-2019 17:07:20 IST
Updated On 02-11-2019 17:08:19 ISTUpdated On 02-11-20192019-11-02T11:37:20.485Z02-11-2019 2019-11-02T11:37:16.154Z - 2019-11-02T11:38:19.117Z - 02-11-2019

2430 జీఓపై ఏపీలో వెల్లువెత్తుతున్న నిరసనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించేలా జారీచేసిన జీవో 2430పై నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ఈ జీవోపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు 2430 జీఓకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నామన్నారు. ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ మద్దతుతో 2430 జీఓను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ జీవో పర్యవసానాలు, మీడియా స్వేచ్ఛకు ఎదురయ్యే ఇబ్బందులను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి అందరి మద్దతు కూడగడతామన్నారు. ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జీఓ ను తీసుకురావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ జీఓ ద్వారా ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు ఎత్తిచూపితే వారిపై కేసులు పెడతామనటం సరైన పద్ధతి కాదన్నారు విజయవాడకు చెందిన జర్నలిస్ట్ వాసు. 

ఏపీయూడబ్ల్యూజే చేసే ప్రతీ ఉద్యమానికి ఐజేయూ మద్దతునిస్తుందని, ఈ జీవోపై పునరాలోచన చేయాలని ఐవీ సుబ్బారావు అన్నారు. జర్నలిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న దేవులపల్లి అమర్ ప్రభుత్వ ప్రతినిధిగా మాత్రమే అభిప్రాయం వ్యక్తంచేశారని, ఆయన వ్యాఖ్యలకు యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తి చేసిన ప్రకటనలను యూనియన్ వ్యతిరేకిస్తోందన్నారు. 

జర్నలిస్టులకు సమాచార మంత్రి కులాలను ఆపాదించటం సహేతుకం కాదన్నారు. జీవో ద్వారా బెదిరింపులకు గురిచేసి మీడియాను గుప్పిట్లోకి తీసుకోవాలని చూడడం అప్రజాస్వామికం అన్నారు సుబ్బారావు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ తనతండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా గొప్పవారేంకాదన్నారు.

ఆయన హయాంలో మీడియాపై ఇన్ని ఆంక్షలు లేవన్నారు. జీఓ 2430 పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పాత్రికేయుల పోరాటం కొనసాగుతుందన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లితే ఏపీయూడబ్ల్యూజే ఐక్య కార్యాచరణతో ముందుకు వెళుతుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle