newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

2024లో అధికారం మాదే... బీజేపీ-జనసేన పొత్తు పొడిచింది

16-01-202016-01-2020 21:06:10 IST
Updated On 17-01-2020 08:11:10 ISTUpdated On 17-01-20202020-01-16T15:36:10.710Z16-01-2020 2020-01-16T15:36:08.166Z - 2020-01-17T02:41:10.719Z - 17-01-2020

2024లో అధికారం మాదే...  బీజేపీ-జనసేన పొత్తు పొడిచింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా అనుకున్నట్టే కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చర్చించాల్సిన అంశాలను చర్చించారు. హోటల్ మురళీ ఫోర్తున్యూ లో భేటీ జరిగింది. అనంతరం జనసేన, బిజెపి నేతల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు చాలా కీలక నిర్ణయాలు జరిగాయన్నారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక‌ అంశాల పై చర్చించామన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ-జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేశారు. 2014నుండి ఏపీలో జరుగుతున్న పరిణామాలు దృష్టి లో పెట్టుకున్నామన్నారు. 2019ఎన్నికలలో టిడిపి లోపాలను ఎత్తి చూపి ఒక్క అవకాశం అంటూ జగన్ అధికారం లోకి వచ్చారని, రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని అథపాతాళంలోకి‌ నెట్టేశాయన్నారు. అవినీతి, అరాచకం, కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్..  బిజెపి తో కలిసి పని చేయాలని భేషరతుగా ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. జగన్ నియంత పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్రంలో  మంచి పాలన, ప్రజలకు మేలు చేసేలా బిజెపి, జనసేన లు కలిసి పని చేస్తాయన్నారు.

2024 అధికారమే లక్ష్యం గా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఈరోజు చారిత్రక నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందని టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమి పనిచేస్తుందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోడీని ఇష్టపడే వ్యక్తిని తానని, మనస్పూర్తిగా ఈ‌కలయికకు ఒప్పుకున్నానన్నారు. ఏపీకి జాతీయ పార్టీ అయిన బీజేపీ అవసరం చాలా వుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

అవినీతి రహిత నాయకులు అయితేనే మంచి పాలన అందిస్తారని తాను భావిస్తున్నానన్నారు. గతంలో బీజేపీతో కలిసి పనిచేసినా, మధ్యలో సైద్ధాంతిక విభేదాల వల్ల విడిపోయామన్నారు పవన్. ఇక నుంచి బిజెపి తో కలసి పయనించాలని నిర్ణయించాయమని, ఏపీలో సునీల్ దేవధర్  నేతృత్వంలో కలిసి వెళతామన్నారు.

కులతత్వం, అవినీతి పాలనను అంతం చేయాలనేది మా ఉద్దేశం అన్నారు. భవిష్యత్తులో  అవగాహన లోపాలు లేకుండా చర్చించామన్నారు. పాలెగాళ్ల రాజ్యంతో ప్రజలు‌ విసిగిపోయారని,  టిడిపి, వైసిపిల ప్రత్యామ్నాయ పార్టీ అధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి జిల్లాల‌ వారీగా పని చేస్తామన్నారు.

ఏపీ రాజకీయాలలో చారిత్రక నిర్ణయం అని చెప్పక తప్పదన్నారు. రాష్ట్ర రాజకీయాలలో సమూల మార్పులకు ఈ పొత్తు దోహదం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

బిజెపి.. జనసేన కలిసి 2024వరకు పయనిస్తామన్నారు. సంక్రాంతి సమయంలో ఈ పొత్తు కొత్త శకానికి నాంది అన్నారు. ఉత్తరాయణం తరహాలో ఈ పొత్తుతో  కమలం మరింత వికసిస్తుందని, జగన్, చంద్రబాబులకు ప్రజలు‌ అవకాశం ఇచ్చినా వారు విఫలమయ్యారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle