newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

2019లో మారిన ఏపీ రాజకీయ రంగుల ముఖచిత్రం

29-05-201929-05-2019 20:18:32 IST
Updated On 29-05-2019 21:01:57 ISTUpdated On 29-05-20192019-05-29T14:48:32.695Z29-05-2019 2019-05-29T14:48:25.504Z - 2019-05-29T15:31:57.751Z - 29-05-2019

2019లో మారిన ఏపీ రాజకీయ రంగుల ముఖచిత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకున్న ఏపీ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 2014లో ఏపీ రాజకీయ  మ్యాప్ ఇటు పసుపు, నీలం, కాషాయం రంగులో ఉండేది. పసుపు రంగు తెలుగుదేశానికి ప్రతీక కాగా, నీలం రంగు వైసీపీ పార్టీది.కాగా, ఇక మిగిలిన రంగు కాషాయం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 2014 నాటి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ జతకట్టాయి. కేవలం అతితక్కువ ఓట్ల శాతంతో అధికారాన్ని కోల్పోయారు జగన్ రెడ్డి. 

అప్పటి ఎన్నికల్లో మూడు రంగులు ఏపీకి ప్రతిబింబంగా నిలిచాయి. టీడీపీ మంత్రివర్గం కూడా కాషాయం, పసుపు రంగుల కలయికతో ముందుకెళ్ళింది. ఇటు రాష్ట్రంలో, కేంద్రంలో ఇరు పార్టీలు మంత్రివర్గంలో భాగస్వాములయ్యాయి. ఎన్నికలకు  ఏడాది ముందు 2018లో రెండింటికి చెడింది. దీంతో కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ, రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బీజేపీ వైదొలిగాయి. 

Image result for jagan vs chandrababu

2014 ఎన్నికల ఫలితాలు, తదనంతర జంపింగ్ జపాంగ్ లతో వైసీపీ అధినేత జగన్ ఢీలా పడ్డారు. కానీ ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటంలా మళ్ళీ తనను తాను సంభాళించుకుని ముందుకు కదిలారు. దీంతో  రెట్టించిన ఉత్సాహంతో జగన్ జనంలోకి వెళ్ళారు. ఏడాదికి పైగా ప్రజాసంకల్పయాత్ర పేరుతో జనం కష్టాలు, ఆకాంక్షలు తెలుసుకున్నారు. ప్రజలతోమమేకం అయ్యారు.

2019 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయరంగుల ముఖచిత్రం ఒక్క రంగుకే పరిమితం అయింది. 2014లో కనిపించిన టీడీపీ హవా అంతర్థానమయింది. టీడీపీకి ఎన్టీఆర్ స్థాపకుడు అయితే, చంద్రబాబు భూస్థాపకుడు అయ్యాడని పలువురు రాజకీయ విశ్లేషకులే వ్యాఖ్యానించారు. 102 సీట్లతో అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు ప్రభ కాస్తా మసకబారింది. టీడీపీ ఒకప్పటి మిత్రపక్షం బీజేపీ మళ్ళీ తన సత్తా చాటింది. కానీ ఏపీలో మాత్రం జీరో ప్రాతినిధ్యం సాధించింది. ఇక జనసేన మాత్రం ఏక్ నిరంజన్ తరహాలో ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. దీంతో ఏపీలో వైసీపీ తన అప్రతిహత ప్రస్థానం ప్రారంభించింది.

Image result for ap political landscape in 2014 elections

2019 ఎన్నికల్లో టీడీపీ నాలుగు జిల్లాల్లో అడ్రస్ గల్లంతయ్యింది. టీడీపీ కంచుకోట లాంటి గోదావరి జిల్లాల్లోనూ సైకిల్ చక్రాలకు పంక్చర్లు పడ్డాయి. మంత్రులే మట్టికరిచారంటే జగన్ ప్రభంజనం ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో నాలుగైదు జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతమంతా బ్లూ మయం అయిపోయింది.అక్కడక్కడా టీడీపీ పసుపు మచ్చలు కనిపించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం లేదని, తమకు నూటికి వెయ్యిశాతం ఫలితాలు వస్తాయన్న తెలుగుదేశం అధినేత ధీమా అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ మిగతా రాష్ట్రాల్లో తమ సత్తా చాటినా ఏపీలో మాత్రం కాషాయం రూపురేఖలు కనిపించలేదు. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లోనూ అదే సీన్. 

రాష్ర్ట విభజన తరవాత రెండోమారు కూడా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా లేరు. సాక్షాత్తూ ఏపీసీసీ సారథి రఘవీరారెడ్డికి ఘోర పరాభవం తప్పలేదు. ఇది రెండవసారి కావడం విశేషం. నరసాపురం పోటీచేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు 10వేల పైచిలుకు ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారంటే కాంగ్రెస్ ఎలాంటి అవసానదశలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉందని తమిళనాడుతో పాటు ఏపీలోనూ నిరూపితమయింది. 

ప్రాంతీయ పార్టీల ఈజైత్రయాత్ర కేవలం ఈ ఎన్నికలకే కాదు 2024 నాటికి కూడా ఇదే విధంగా  కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గుబ్బల తమ్మయ్య చెబుతున్నారు. ఈ ఐదేళ్ళు పార్టీని కాపాడుకోవడం టీడీపీ అధినేతకు కత్తిమీద సాములాంటిదే. ఒంటరిగా బరిలోకి దిగితే టీడీపీకి పుట్టగతులుండవని మరోమారు రుజువైంది. ఇటు వైసీపీ దీనికి విరుద్ధంగా ఎవరితోనూ పొత్తులేకుండానే బలమయిన అధికార పక్షం మెడలు వంచింది. ఎన్నికల్లో చిత్తు చేసింది. ఇదీ మారిన ఏపీరాజకీయరంగుల ముఖచిత్రం. అసెంబ్లీలో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో ?

 

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   9 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle