newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?

09-12-201909-12-2019 15:10:50 IST
2019-12-09T09:40:50.372Z09-12-2019 2019-12-09T09:40:48.132Z - - 19-01-2020

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును.. మీరు చదివింది నిజమే. అటు ఇటుగా ఇరవై మంది ఎమ్మెల్యేలున్న టీడీపీని ఎదుర్కొనడానికి 150 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగానే రెండు పార్టీలు శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నాయి.

అయితే ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడం కోసం 150 మంది ఎమ్మెల్యేలకు గైడ్ లైన్ చేయడం ఆసక్తిగా మారింది. టీడీపీకి వల్లభనేని వంశీ దూరం కావడంతో ఇక 22 మందే ఉన్నారు. అందులో అధినేత చంద్రబాబును పక్కనపెట్టగా మిగతా వారిలో కూడా నలుగురైదుగురు సైలెంట్ గా ఉంటున్నారు. మిగిలింది గట్టిగా 15 మంది ఎమ్మెల్యే హౌస్ బయట ఫైట్ చేస్తున్నారు. వీళ్ళే హౌస్ లోపల చెలరేగిపోనున్నారు.

సుమారుగా ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకి ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ వేసేందుకు సిద్ధంగా ఉన్న సభ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారనుంది. కాగా ఇప్పటికే వైసీపీ నేతలలో అసహనం కట్టలు తెంచుకుంటుంది. టీడీపీ నేతలు చేసే ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో మంత్రులతో సహా వైసీపీ నేతలు అసహనం తట్టుకోలేక బూతులు లంకించుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో అలాంటి సన్నివేశాలు తెలుగు ప్రజలంతా చూసేశారు. ఒక్కో సమస్యపై ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో మంత్రులు విసుగొచ్చేసి వ్యక్తిగత దూషణలు చేసేశారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాల నాటికి టీడీపీని దెబ్బకొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సభలో కూర్చోబెట్టాలని కూడా సీఎం ప్రయత్నాలలో ఉన్నారని కూడా మరో పక్క ప్రచారం జరుగుతుంది.

ఇక టీడీపీ కూడా ఉన్న నలుగురితోనే ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్దమవుతుంది. గత ఆరు నెలలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల ఇబ్బందులపై ఫోకస్ పెట్టిన ప్రతిపక్షం.. వాటికి సమాధానం చెప్పలేక మంత్రులు చేస్తున్న వితండవాదం, బూతు పురాణం అందుకున్నారన్నదే అస్త్రంగా మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు.

ప్రభుత్వం రాజకీయ సమీకరణాలతో పాటు ఎప్పటి మాదిరే గత టీడీపీ ప్రభుత్వం జరిగిన ప్రతిపనిని కూడా ఇప్పుడు ప్రతి అంశంలో చర్చకు తెచ్చేందుకు కూడా ప్రణాళికలు రాసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా నిండుగా అధికారమున్న వైసీపీ ఒకపక్క.. ఉన్న నేతలలో కూడా నోరుమెదపలేని స్థితిలో టీడీపీ మరోపక్కన ఉన్న ఈ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle