newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

18వ రోజు ఆందోళనలు.. అమరావతిలో బంద్

04-01-202004-01-2020 12:53:34 IST
Updated On 04-01-2020 12:53:32 ISTUpdated On 04-01-20202020-01-04T07:23:34.703Z04-01-2020 2020-01-04T07:22:18.671Z - 2020-01-04T07:23:32.970Z - 04-01-2020

18వ రోజు ఆందోళనలు.. అమరావతిలో బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీకి మూడు రాజధానులంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలపై అమరావతి రైతులు, స్థానికులు మండిపడుతున్నారు. దీంతో 18 వ రోజు  రాజధాని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మందడంలో ఉదయం నుంచే బంద్ వాతావరణం కనిపిస్తోంది.

Image may contain: 17 people, people standing

శుక్రవారం నిరసన సందర్భంగా మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బంద్ పాటిస్తున్నారు. అమరావతి కి మద్దతుగా పలు జిల్లాలో సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

పోలీసు వాహనాలను తమ గ్రామాలమీదుగా వెళ్ళవద్దంటూ రైతులు అడ్డుకుంటున్నారు. పోలీసులకు తాగునీరు సహా ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని రైతులు నిర్ణయించారు. రైతులతో పోలీసులు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. కొంతమంది పోలీసులు తమకు సహకరించాలని కోరుతున్నారు. దుకాణాలు తెరవకుండా ఆందోళన సాగుతోంది.

రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సహాయనిరాకరణ సాగుతుందని రైతులు ప్రకటించారు. 29 గ్రామాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఎన్ని అడ్డంకులు కల్పించినా తమ శాంతియుత నిరసన సాగుతుందన్నారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రైతులు బైఠాయించారు.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle