newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

17 మందిని ‘చంపిన’ డ్రైవర్ అరెస్ట్

18-05-201918-05-2019 15:26:23 IST
Updated On 18-05-2019 18:01:20 ISTUpdated On 18-05-20192019-05-18T09:56:23.503Z18-05-2019 2019-05-18T09:56:17.254Z - 2019-05-18T12:31:20.791Z - 18-05-2019

17 మందిని ‘చంపిన’ డ్రైవర్ అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మరణానికి కారకుడు ఆ డ్రైవర్. నిశ్చితార్థం కోసం వెళ్లి తిరిగి వస్తున్న ఓకే ఊరి జనమంతా క్షణాల్లో విగత జీవులయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం అనేక కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. 

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ నెల 11న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ వోల్వో బస్సు డ్రైవర్‌ జోసెఫ్‌ను అరెస్టు చేసినట్లు డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. డోన్‌లోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు

ఈ ప్రమాదంలో బైక్, తుఫాను వాహనాన్ని వోల్వో బస్సు ఢీకొట్టడంతో మొత్తం 17 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఇందుకు కారణమైన బస్సు డ్రైవర్‌ కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాల్‌ టౌన్‌కు చెందిన జోసెఫ్‌ అని తేలింది. అప్పటినుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు గాలించి జోసెఫ్ ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటివరకు 63 మందిని విచారించినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్, బస్సుల తయారీ సంస్థ అయిన స్కానియాలకు నోటీసులిచ్చారు. 

రహదారులు కాదు...మృ‌త్యుదారులవి 

హైవేపై అతివేగాన్ని అధికారులు నియంత్రించడం లేదు. దీని వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నిబంధనల ప్రకారం హైవేపై వాహనాల వేగం 80కిలోమీటర్లు మించరాదు. వాహనాల డ్రైవర్లు దీన్ని అసలు పాటించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌, ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో వస్తున్నాయి. శనివారం వెల్దుర్తి హైవే కూడలి వద్ద ప్రమాదానికి కారణమైన ఓ బస్సు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చింది. గత ఏడాది నుంచి.. ఇప్పటి వరకు హైవేపై 120 ప్రమాదాలు జరిగాయి. 

ఈ ప్రమాదాల్లో 80మంది మృత్యుబారిన పడ్డారు. 100మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. గత ఏడాదిలో డోన్‌ హైవేలో 64 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 38మంది చనిపోగా, 80మంది గాయపడ్డారు. అదే విధంగా వెల్దుర్తి హైవేలో గత ఏడాది 27ప్రమాదాల్లో 8మంది మృతిచెందారు. 18మంది గాయపడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐదు ప్రమాదాల్లో 20మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆరుగురు గాయపడ్డారు.హైవేపై మలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని పాటించడం లేదు. జాతీయ రహదారిపై భద్రతను గాలికొదిలేశారు అధికారులు. దీంతో ప్రమాదాల బారినపడి అనేకమంది మరణిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని భద్రతాచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉందంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle