newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

14న కేబినెట్ భేటీ.. ఎజెండాపై బాబు పక్కా స్కెచ్!

08-05-201908-05-2019 17:09:07 IST
Updated On 01-07-2019 12:29:10 ISTUpdated On 01-07-20192019-05-08T11:39:07.438Z08-05-2019 2019-05-08T11:39:05.510Z - 2019-07-01T06:59:10.271Z - 01-07-2019

14న కేబినెట్ భేటీ.. ఎజెండాపై బాబు పక్కా స్కెచ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తీవ్ర ఉత్కంఠ రేపిన ఏపీ కేబినేట్ భేటీ ఈ నెల 14కు వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కేబినేట్ భేటీ ఈ నెల 14కు వాయిదా వేస్తూ సీఎంవో నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం కేబినేట్ భేటీ నిర్వహించాలంటే కనీసం 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందాల్సి ఉన్న నేపథ్యంలో సీఎంవో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే ఈ నెల 10న జరగాల్సిన కేబినేట్ భేటీపై సీఎస్ కార్యాలయాన్ని సీఎంవో నుంచి నోట్ రాడంతో ప్రతిష్టంభన మొదలైంది. ఈ నేపథ్యంలోనే చీఫ్ సెక్రటరీతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా ఎన్నికల కోడ్, కేబినేట్ నిర్వహణ, ఎజెండాలోని అంశాలపై ప్రధానంగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కేబినేట్ భేటీ అజెండా విషయమై ముందుగా అనుమతి పొందాల్సి ఉందని తేల్చారు. 

దీంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇదే విషయమై సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్‌తో సమావేశమై చర్చించారు. 10వ తేదీ కేబినెట్ నిర్వహించాలంటే సమయం సరిపోదు.. దీంతో 14న కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యదర్శి సూచించినట్టు తెలుస్తోంది. అసాధారణ పరిస్థితులను ఉటంకిస్తూ చంద్రబాబు కేబినెట్ భేటీకి సిద్ధమయ్యారు. వేసవి తీవ్రత, తాగునీటి సమస్య, ఫొణి తుఫాను సహాయ చర్యలు, కరువు పరిస్థితులపై చర్చించేలా సీఎం చంద్రబాబు నోట్ తయారు చేయించారు.

అజెండాలోని అంశాలకు కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతించాల్సి ఉంది. ఫొని తుపాను సందర్భంగా నాలుగు జిల్లాల్లో ఈసీ కోడ్ ఎత్తివేసిన సందర్భాన్ని ప్రస్తావించిన అధికారులు, ఈసీ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు కేబినెట్ భేటీపై సీఎస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘నోటితో చెబుతూ నొసటితో వెక్కిరించడం తరహాలో  ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించుకోడానికి అభ్యంతరం లేదన్నారు సీఎస్.

సమావేశాల నిర్వహణలో అనుసరించాల్సిన ప్రక్రియలను ఈసీ నిర్దేశించిందని, కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా కోడ్‌ అమల్లో ఉన్నప్పుడే జరిగిందని సీఎస్ వివరించారు. తుపాను వల్ల నష్టం వాటిల్లితే దానిని చర్చించవచ్చని, అయితే ఏపీకి అలాంటి విపత్కర పరిస్థితి రాలేదన్నారు సీఎస్. మొత్తం మీద కేబినెట్ భేటీ ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle