newssting
BITING NEWS :
*ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం *ఏపీలో మరో ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో ప్రభుత్వ విప్ సునీతకు కరోనా పాజిటివ్ నిర్దారణ *గోల్కొండ, చార్మినార్ సందర్శనకు అనుమతి *అమరావతి ఉద్యమానికి 200 రోజులు... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే నిరసనలు తెలపాలని పిలుపు. ఊరిలో 10 మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ. *హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు కాంగ్రెస్ ఆందోళనలు. తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్న కాంగ్రెస్*తెలంగాణలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1892 పాజిటివ్ కేసులు న‌మోదు, ఎనిమిది మంది మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,658 కొత్త క‌రోనా కేసులు*ఏపీ: మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర అరెస్ట్.. తుని మండలం సీతారాంపురం ద‌గ్గ‌ర కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు*ఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా జేఈఈ, నీట్ వాయిదా.. జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్ 1 నుంచి 6 వ తేదీ మధ్య, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సెప్టెంబర్ 27న.. నీట్ సెప్టెంబర్ 13న నిర్వ‌హ‌ణ*ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో కంపించిన భూమి... రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త 4.5గా న‌మోదు*ఢిల్లీ: లోకసభ స్పీకర్‌ను క‌లిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై ఫిర్యాదు*భారత ప్రధాని మోడీ లఢఖ్ పర్యటన గురించిన సమాచారం మాకు ముందే తెలుసని చైనా విదేశాంగ శాఖ ప్రకటన*ఏపీలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదు. 9 మరణాలు. ఏపీలో 16,934కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు 206కరోనా మరణాలు*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6,44,404...మరణాలు 18597

14నచంద్రబాబు ఇసుక దీక్ష.. వైసీపీ తీవ్ర విమర్శలు

05-11-201905-11-2019 15:08:25 IST
Updated On 05-11-2019 15:26:45 ISTUpdated On 05-11-20192019-11-05T09:38:25.093Z05-11-2019 2019-11-05T09:34:32.344Z - 2019-11-05T09:56:45.080Z - 05-11-2019

14నచంద్రబాబు ఇసుక దీక్ష.. వైసీపీ తీవ్ర విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈనెల 14వతేదీన ఇసుక సమస్యపై విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు. ఇసుక సమస్యపై ఒకరోజు దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇసుక దీక్ష నిర్వహిస్తామని టీడీపీ ప్రకటించింది. ఈదీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు పార్టీ వర్గాలు, నేతలు సిద్ధమయ్యారు. వే ఆదివారం ఇసుక లాంగ్ మార్చ్ లో జనసేనకు టీడీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

లాంగ్ మార్చ్ కు టీడీపీ ఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ లాంగ్ మార్చ్ అనంతరం విజయవాడ ధర్నాచౌక్ లో బీజేపీ ఇసుక సత్యాగ్రహం నిర్వహించింది. ఇసుక సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ సత్యాగ్రహం అనంతరం చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు. ఇసుక కొరత విషయంలో టీడీపీ ఇప్పటికే ధర్నాలు, నిరసనలు చేపట్టింది. జగన్ పాలన ప్రారంభం అయ్యాక చంద్రబాబు చేపడుతున్న తొలి దీక్ష ఇదే. 

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా గుంటూరులో దీక్షకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించింది. కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఇసుక కొరతతో పనుల్లేక కార్మిక కుటుంబాలు ఇలా చితికి పోవడం చూసి మనసుకు బాధగా అనిపిస్తోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇసుక విషయంలో విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని అధికార వైసీపీ మండిపడుతోంది. చంద్రబాబు బుర్రపాడైపోయింది...బాలల దినోత్సవం రోజు దీక్ష చేయడం ఏమిటి? ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం వల్ల కాదు, గత ప్రభుత్వంలో చంద్రబాబుతో కలిసి చేసిన దోపిడీ వల్లే రాష్ట్రం నాశనం అయ్యింది అని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబుని ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు బొత్స. ఇసుక కొరతకు చంద్రబాబే కారణం అని విమర్శించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స. 

 

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

   33 minutes ago


‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

   an hour ago


టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

   an hour ago


ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

   7 hours ago


వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

   7 hours ago


రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

   9 hours ago


విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

   9 hours ago


సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

   10 hours ago


ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

   11 hours ago


తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle