newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

12న బడ్జెట్‌.. 30 వరకు ఏపీ అసెంబ్లీ

10-07-201910-07-2019 15:20:00 IST
Updated On 11-07-2019 12:01:39 ISTUpdated On 11-07-20192019-07-10T09:50:00.216Z10-07-2019 2019-07-10T09:49:57.741Z - 2019-07-11T06:31:39.726Z - 11-07-2019

12న బడ్జెట్‌.. 30 వరకు ఏపీ అసెంబ్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12న ప్రారంభం అవుతాయి. 30 వరకూ కొనసాగుతాయి. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పని దినాలపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయి. 12వ తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ సభ ముందు ఉంచుతారు. 

అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా మైక్‌ కట్‌ చేయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటి పనులను తాము చేయబోమన్నారు. బీఏసీ సమావేశం చాలా అర్థవంతంగా జరిగిందన్నారు.  సభలో మొత్తం 23 అంశాల మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపు వంటి ముఖ్య అంశాలతో పాటు అగ్రిగోల్డ్, కె టాక్స్, ఉద్యోగుల సంక్షేమం, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలు మీద చర్చ ఉంటుందని  తెలిపారు. సభ అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ ఎన్నిరోజులు జరపాలని సీఎం జగన్‌ ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడిని అడిగితే.. సమధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.మొత్తం మీద ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle