facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

హోదాల్ని మరచి... హుందాతనాల్ని వదిలేసి..!

11-02-201911-02-2019 11:26:24 IST
Updated On 11-02-2019 11:47:19 ISTUpdated On 11-02-20192019-02-11T05:56:24.416Z11-02-2019 2019-02-11T05:56:20.072Z - 2019-02-11T06:17:19.139Z - 11-02-2019

హోదాల్ని మరచి... హుందాతనాల్ని వదిలేసి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హోదాలను మరచి, హుందాతనాల్ని వదిలేసి ఒక ప్రధాని-మరో ముఖ్యమంత్రి చేసిన చేష్టలు, మాట్లాడిన మాటలు నేలబారు రాజకీయాల్ని తలపించాయి. ఆదివారం తెలుగు నేల సాక్షిగా జరిగిపోయిన ఈ మాటల యుద్ధంలో ఒకర్ని మించి మరొకరు విమర్శల పేరుతో వ్యక్తిగత జీవితాల్ని కూడా బయటకీడ్చుకోవడం ఒకానొక  సిగ్గుమాలిన పని. రాజ్యాంగబద్ధమైన హోదాలు ఇచ్చిన గౌరవాల్ని పక్కనపడేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు సంవత్సరం తరువాత మోడీ వచ్చారు. బాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత జరిగిన మొదటి పర్యటన కాబట్టి సహజంగానే రాజకీయాసక్తిని కలిగించింది. మోడీ ఒక  ప్రధానిగా విశాఖలో పర్యటిస్తే , పార్టీ నాయకుడిగా గుంటూరులో పర్యటించారు. విశాఖ పర్యటన అధికారికం కాబట్టి అక్కడి కారక్రమాల్లో ముఖ్యమంత్రి పేరును చేర్చి ఉండాల్సింది. అలా జరగకపోవడం సహజంగానే చంద్రబాబుకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

అయితే ఇదే చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్న మోడీని ఎద్దేవా చేశారు. "ఏ ముఖం పెట్టుకుని వస్తారంటూ"ప్రశ్నించారు. ‘గో బ్యాక్ మోడీ’ అన్న రాతలు రాసి పెద్దపెద్ద హోర్డింగులు పెట్టించారు. కరపత్రాల్ని పంచారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మోడీ ఫ్లెక్సీలను చించి హంగామా సృష్టించారు. విమానాశ్రయానికి స్వయంగా ఆహ్వానించి వెంట తీసుకురావాల్సిన సంప్రదాయాన్ని పూర్తిగా పక్కనపడేసి కనీసం అక్కడికి తన కాబినెట్ సహచరుణ్ణి కూడా పంపలేదు. పైగా దీనికి పెద్ద రాజకీయ రంగును పులిమి ప్రత్యేక హోదాతో జమకట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిని కిందపడేసి చంద్రబాబు చేసిన  వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. 

ఇక మోడీ తన  ‘సన్ రైజింగ్’ వ్యాఖ్యలతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని పక్కనపడేసి కొడుకు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దీంతో చంద్రబాబు హడావుడిగా మీడియాను పిలిచి తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్లు ఏకంగా మోడీ భార్యను పట్టించుకోని, కుటుంబ విలువలు తెలియని మనిషంటూ కస్సుమన్నారు. మోడీ వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే తానూ ఈ మాటలు అనాల్సి వచ్చిందంటూ సమర్ధించుకున్నారు. దీంతో వ్యవహారం మొత్తం పక్కదారిపట్టింది. 

ఎంత రాజకీయ విబేధం ఉన్నా ఒక ప్రధాని రాష్ట్రానికి వచ్చినపుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకడం విద్యుక్త ధర్మం. ఎడమొహం పెడమొహంగా ఉండైనా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి. మోడీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నంతవరకూ ఆయన ఒక ప్రధాని. అవి పూర్తయిన తరువాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో  బీజేపీ నాయకుడు. ఇక ఇక్కడ ఒక పార్టీ నాయకుడిగా మోడీ చేసిన వ్యాఖ్యలను మరో పార్టీ అధ్యక్షుడి స్థాయిలో విమర్శించవచ్చు. కానీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఒక పార్టీ అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి మధ్యన ఉండవలసిన తేడాను పూర్తిగా చెరిపేసారు. మోడీ కూడా తక్కువేమీ తినలేదు. అసలు రాష్ట్రానికి వచ్చిందే చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలడానికే అన్నట్లు ప్రవర్తించి ఒక ప్రధాన మంత్రి స్థాయిని కూడా దిగజార్చిపారేశారు. 

కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా క్షీణించి చాలాకాలమైంది. కేంద్రం పెత్తనాలు , జోక్యాలు ఎక్కువయ్యాయి. వాటి మధ్య సుహృద్భావ వాతావరణం లేదు. రాష్ట్రాల హక్కుల్ని హరించివేస్తున్నాయన్న ఆరోపణలూ పాతవే. ఇటువంటి విషయాల్లో రాష్ట్రాలు నిర్ణయాత్మకంగా ఉండి, తమ హక్కులు సాధించుకోవడానికి పోరాడాల్సిందే.

అయితే ఈ క్రమంలో జరుగుతున్న వ్యవహారాలు రాజకీయాల స్థాయిని దిగజార్చి, ఆయా పదవులు చేపట్టిన వారు తమ హోదాల్ని మరిచిపోయేలా చేయడమే విచారించవలసిన విషయం. మోడీ అహంకారపూరిత ధోరణిని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రాల్ని తన పార్టీ రాజకీయపటంలోకి చేర్చడానికి ఆయన వ్యవహారశైలి, భావజాలం అన్నీ చౌకబారుతనాన్ని తలపిస్తున్నాయి. 

మొత్తం మీద ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ దూషణభూషణలతో దద్దరిల్లిపోయింది. అటు మోడీ ఢిల్లీకి వెళ్ళిపోతే... బాబు తన ధర్మపోరాట దీక్షా వేదికను అదే ఢిల్లీలో సోమవారం మొదలుపెట్టి రాజకీయవేదికను అక్కడికే మార్చివేశారు. 

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle