newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

హైకోర్టు విభజనకు అంతా రెడీ

26-12-201826-12-2018 12:55:44 IST
2018-12-26T07:25:44.080Z26-12-2018 2018-12-26T07:25:41.506Z - - 18-07-2019

హైకోర్టు విభజనకు అంతా రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి హైకోర్టుని విభజించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగి నాలుగున్నరేళ్ళు దాటిపోయింది. హైకోర్టు విభజన కోసం ఏపీతో పాటు, తెలంగాణ అడ్వకేట్లు సైతం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అత్యంత జటిలంగా మారిన ఉమ్మడి హైకోర్టు విభజనకు ఇక ఎంతో సమయం పట్టేలా లేదు. ఇటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్రం కృషితో ఏ క్షణంలోనైనా హైకోర్టును విభజించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో  కేంద్రం హైకోర్టు విభజనకు అంగీకారం తెలుపుతూ.. ఫైల్‌‌ను రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది. దాంతో హైకోర్టు విభజన ఏ క్షణంలోనైన జరిగే అవకాశం ఉందంటున్నారు. కేంద్రం పంపిన హైకోర్టు విభజన దస్త్రం పైన సందేహాలు ఉండటంతో.. వాటి నివృత్తి కోసం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌.. వీటిని తిప్పి పంపే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. దీంతో ఈ సందేహాల నివృత్తి కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. దాంతో హైకోర్టు విభజన అంశాన్ని.. ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రులు వద్ద సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

రాష్ట్రపతి హైదరాబాద్‌లో శీతాకాల విడిది పూర్తిచేసుకుని ఢిల్లీ వెళ్ళారు. దీంతో త్వరలోనే హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే హైకోర్టు విభజన ఎప్పుడు జరిగినా.. తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏపీ హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఏపీలోని నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం.. దాదాపు పూర్తయింది. రాష్ట్రపతి జారీ చేసే నోటిఫికేషన్‌ తేదీకి.. ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే  అపాయింటెడ్‌ డే‌కు కనీసం మూడు నెలల సమయం ఉంటుంది. దాంతో మిగిలిన పనులు ఏమైనా ఉంటే.. ఈ లోపు పూర్తిచేసుకోవచ్చని భావిస్తున్నారు. హైకోర్టు జడ్జిల విభజన ఇప్పటికే పూర్తయింది. తెలంగాణకు 11 మంది జడ్జిలను కేటాయించగా.. వీరిలో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఏపీకి 14 మంది న్యాయమూర్తులను కేటాయించారు. మరో ఇద్దరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. మరో వైపు ఉద్యోగుల విభజన వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 1500 మంది నుంచి ఆప్షన్లను స్వీకరించారు. అలాగే ఆఫీస్‌ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్‌ బేరర్లు, లిఫ్ట్‌ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈప్రక్రియలు పూర్తయితే ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు సాగించనుంది. వివిధ కేసుల కోసం తరచూ హైదరాబాద్‌కు వెళ్ళే ఏపీ కక్షిదారులు, అడ్వకేట్లకు సమయం, డబ్బు ఆదా కానుంది.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle